Jr NTR: ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్‌ని చూశారా? సింపుల్‌గా ఉన్నా కాస్ట్ మాత్రం కోట్లలోనే.. ఒక సినిమా తీయచ్చు

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాప అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం దేవర రాక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు

Jr NTR: ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్‌ని చూశారా? సింపుల్‌గా ఉన్నా కాస్ట్ మాత్రం కోట్లలోనే.. ఒక సినిమా తీయచ్చు
Jr NTR
Follow us
Basha Shek

|

Updated on: Aug 10, 2024 | 8:24 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాప అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం దేవర రాక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలోనే అభిమానులకు ఒక శుభ వార్త అందించాడు ఎన్టీఆర్. కేజీఎప్‌, సలార్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్ తో సినిమాను పట్టాలెక్కించాడు. శుక్రవారం (ఆగస్టు 08) హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోలో ఎన్టీఆర్- నీల్ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరయ్యాడు ఎన్టీఆర్. ఈ వేడుకలో తారక్ కొడుకులు ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే వేడుకలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ కూడా అభిమానులకు తెగ నచ్చేసింది. ముఖ్యంగా తారక్ ధరించిన వాచ్ అందరి దృష్టని ఆకర్షించింది. దీంతో దీని ధర ఎంత ఉంటుందబ్బా? అంటూ నెటిజన్లు గూగుల్ తల్లిని ఆశ్రయించారు. అక్కడ ఆ వాచ్ రేటు చూసిన వారందరూ అవాక్కవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ స్విట్జర్లాండ్ కు చెందిన పాటక్ ఫిలిప్ అనే లగ్జరీ బ్రాండెడ్ వాచ్ అని తెలుస్తోంది. బయట చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ, దీని ఖరీదు సుమారు రూ. 2.45 కోట్లకు పైగానే ఉంటుందట. ఇదే కాదు ఈ బ్రాండ్ లో లభించే వాచ్‌లన్నీ కోట్ల రూపాయలు విలువ చేస్తాయట. గతలో ఒక సినిమా ఫంక్షన్ కు కూడా ఇదే వాచ్ తో హాజరయ్యాడు యంగ్ టైగర్. కాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఇక దేవర విషయానికి వస్తే.. దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే