- Telugu News Photo Gallery Cinema photos Director shankar and producer dil raju hopes on Ram Charan's Game Changer movie, details here Telugu Heroes Photos
Game Changer: ఎంత మందికి హిట్ ఇవ్వాలి.? డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆశలన్నీ చెర్రీ పైనే..
జరగండి పాట ట్రోల్స్ సంగతేమోగానీ, సినిమా గురించి మాత్రం సాలిడ్ అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్. పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టేశాం అంటూ డబ్బింగ్ విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా హిట్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో తెలుసా.? రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ తర్వాత ఈ జోడీ మరోసారి రిపీట్ అవుతోంది.
Updated on: Aug 10, 2024 | 8:43 PM

జరగండి పాట ట్రోల్స్ సంగతేమోగానీ, సినిమా గురించి మాత్రం సాలిడ్ అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్.

డిసెంబర్ 20 లేదా క్రిస్టమస్‌కి సినిమా రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ తర్వాత ఈ జోడీ మరోసారి రిపీట్ అవుతోంది.

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇలా బయటికొచ్చిందో లేదో.. అప్పుడే అభిమానుల్లో కంగారు మొదలైంది. మరి ఆ టెన్షన్‌కు కారణమేంటి.?

ఈ ఇయర్ ఎండింగ్‌లోనే కాదు, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లోనూ గేమ్ ఛేంజర్ వైబ్స్ పాజిటివ్‌గా కంటిన్‌యూ అవుతాయని భరోసా ఇస్తున్నారు దిల్‌రాజు.

దాంతో చరణ్ సినిమాకు అక్కడ స్క్రీన్స్ తక్కువగా దొరికే ఛాన్స్ ఉంది. మరోవైపు హిందీలో క్రిస్మస్‌కు బేబీ జాన్‌తో పాటు అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ రానున్నాయి.

భారతీయుడు 2 సినిమా మార్నింగ్ షోతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో, పూర్తి నమ్మకాన్ని గేమ్‌ఛేంజర్ మీదే పెట్టుకున్నారు శంకర్.




