- Telugu News Photo Gallery Cinema photos Balakrishna's Unstoppable With NBK Season 4 OTT Release Date, details here Telugu Heroes Photos
Unstoppable 4: బాలయ్య ఈజ్ బ్యాక్.. ఈసారి దద్దరిల్లిపోవాలి.! సరికొత్త హంగులతో అన్‌స్టాపబుల్ 4
దసరా రేసులో నేనూ ఉన్నానంటున్నారు బాలయ్య.. ఇంత సడన్‌గా అనౌన్స్ చేస్తే ప్రమోషన్లు ఎప్పుడు చేసుకుంటారు? మిగిలిన సినిమాలతో ఎప్పుడు పోటీ పడతారు? అని అనుకుంటున్నారా? మీరేం ఫికర్ చేయకండి.. మనం అన్‌స్టాపబుల్ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్న నందమూరి అందగాడు దసరాకి ఏం ప్లాన్ చేసినట్టు.?
Updated on: Aug 10, 2024 | 8:05 PM

దసరా రేసులో నేనూ ఉన్నానంటున్నారు బాలయ్య... ఇంత సడన్‌గా అనౌన్స్ చేస్తే ప్రమోషన్లు ఎప్పుడు చేసుకుంటారు? మిగిలిన సినిమాలతో ఎప్పుడు పోటీ పడతారు? అని అనుకుంటున్నారా?

మీరేం ఫికర్ చేయకండి.. మనం అన్‌స్టాపబుల్ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్న నందమూరి అందగాడు దసరాకి ఏం ప్లాన్ చేసినట్టు.?

నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అంటూ అన్‌స్టాపబుల్‌గా ప్రతి సీజన్‌తోనూ దూసుకుపోయారు నందమూరి బాలకృష్ణ. అన్ ఫిల్టర్డ్ కాన్వర్జేషన్స్, ఫుల్ ఫన్, ఎమోషన్స్, సీక్రెట్స్ అంటూ రకరకాల ఫీలింగ్స్ మిక్స్ చేసి మూడు సీజన్లను సక్సెస్ చేశారు నందమూరి నట సింహం బాలయ్య.

థర్డ్ సీజన్ ని లిమిటెడ్‌గా చేశామని టెన్షన్ పడొద్దు. ఫోర్త్ సీజన్‌తో పండగ చేసుకుందాం అంటూ హింట్ ఇస్తున్నారు. దసరా టు సంక్రాంతి నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి సిద్ధమంటున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ మిస్టర్ నందమూరి బాలకృష్ణ.

ఎన్నికల సీజన్ వల్ల షూటింగ్ వాయిదా పడకపోయి ఉంటే బాబీ డైరక్షన్‌లో బాలయ్య నటిస్తున్న సినిమా ఈ దసరాకే విడుదల కావాల్సింది. ఇప్పుడు ఆ కొరతను తీర్చడానికి ఫ్యాన్స్ ని దసరాకి పలకరించడానికి రెడీ అయిపోయారు సిల్వర్‌స్క్రీన్ భగవంత్ కేసరి.

నెవర్ బిఫోర్ అన్నట్టు.. ఇంతకు ముందు ఏ షోలలోనూ కనిపించని అతిరథమహారథులతో ఈ సారి సీజన్ అద్దిరిపోతుందనే లీక్స్ అందుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్‌కి తెర లేపినట్టయింది. ఒకరూ, ఇద్దరూ కాదు.. అంతకు మించే.. కెప్టెన్లు వీళ్లిద్దరు ఇచ్చే హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.




