AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: ‘సమంతతో విడిపోయాక నాగ చైతన్య డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు’.. నాగార్జున కామెంట్స్ వైరల్

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. తమ విడాకుల వ్యవహారంపై నాగ చైతన్య, సమంత వివిధ సందర్భాల్లో స్పందించారు. తాజాగా ఇదే విషయంపై నాగార్జున మాట్లాడారు. సమంత వెళ్లిపోయాక నాగ చైతన్య పరిస్థితి ఎలా ఉందో నాగార్జున వివరించారు.

Nagarjuna: 'సమంతతో విడిపోయాక నాగ చైతన్య డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు'.. నాగార్జున కామెంట్స్ వైరల్
Nagarjuna
Basha Shek
|

Updated on: Aug 10, 2024 | 9:40 PM

Share

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. తమ విడాకుల వ్యవహారంపై నాగ చైతన్య, సమంత వివిధ సందర్భాల్లో స్పందించారు. తాజాగా ఇదే విషయంపై నాగార్జున మాట్లాడారు. సమంత వెళ్లిపోయాక నాగ చైతన్య పరిస్థితి ఎలా ఉందో నాగార్జున వివరించారు. కాగా ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. వేడుక అనంతరం నాగ చైతన్య, శోభితల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబోయే కొత్త జంటను ఆశీర్వదించాలని అందరినీ కోరారు. ఇదే సందర్భంగా నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహరంపై కూడా ఆయన స్పందించారు. ‘సమంత, నాగ చైతన్య 2017 లో వివాహం చేసుకున్నారు. 2021లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అప్పుడు అతనితో పాటు మా కుటుంబానికి చాలా కష్టంగా రోజులు గడిచాయి. నా కొడుకు తన భావాలను ఎవరి ముందు వ్యక్తపరచడు. కానీ అతను బాధలో ఉన్నాడని నాకు అర్థమైంది’

‘ఇప్పుడు మళ్లీ చైతన్య ముఖంలో నవ్వు చూస్తున్నాను. నాగచైతన్య, శోభిత వండర్ ఫుల్ కపుల్. వారికి నిశ్చితార్థం మాత్రమే అయ్యింది. వారి పెళ్లి విషయంలో కంగారేం లేదు. మంచిరోజు అని సడెన్‌గా నిశ్చితర్థం కార్యక్రమం పెట్టుకున్నాం. శోభితా తల్లిదండ్రులకు నాగ చైతన్య అంటే చాలా ఇష్టం. తండ్రిగా నా ఇద్దరు కొడుకులను చూసి నేనెంతో గర్వపడతాను. వాళ్లు సంతోషంగా ఉండాలనే ఎప్పుడూ కోరుకుంటాను’ అని నాగర్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

‘ఆగస్ట్ 8న శోభిత, నాగ చైతన్య ఉంగరాలు మార్చుకున్నారు. ‘మంచి రోజు కావడంతో ఈ రోజును ఎంచుకున్నాం. ఇరు కుటుంబాల వారు జాతకం చూడగా.. ఆగస్ట్ 8 మంచి రోజు అని చెప్పారు’ అందుకే సడెన్ గా నిశ్చితార్థం కార్యక్రమం పెట్టుకున్నాం’ అని నాగ్ తెలిపారు.

నాగ చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!