AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత.. హ్యాట్సాఫ్ అంటోన్న క్రీడాభిమానులు

పారిస్ ఒలింపిక్స్‌లో-2024లో భారత్ తన ప్రయాణాన్ని ముగించింది. టోక్యో ఒలింపిక్స్ కంటే ఒకటి తక్కువగా అంటే మొత్తం ఆరు పతకాలు సాధించింది. షూటింగ్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో భారత్ పతకాలు సాధించింది. భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన క్రీడాకారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, స్థలాలు కూడా ఆఫర్ చేస్తున్నాయి

Paris Olympics 2024: దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత.. హ్యాట్సాఫ్ అంటోన్న క్రీడాభిమానులు
Paris Olympics 2024
Basha Shek
|

Updated on: Aug 11, 2024 | 11:48 PM

Share

పారిస్ ఒలింపిక్స్‌లో-2024లో భారత్ తన ప్రయాణాన్ని ముగించింది. టోక్యో ఒలింపిక్స్ కంటే ఒకటి తక్కువగా అంటే మొత్తం ఆరు పతకాలు సాధించింది. షూటింగ్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో భారత్ పతకాలు సాధించింది. భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన క్రీడాకారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, స్థలాలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఒక క్రీడాకారుడు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన రెండు ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించాడు. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆ అథ్లెట్ చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో మను భాకర్‌తో కలిసి భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు సరబ్ జోత్ సింగ్. హర్యానాలోని అంబాలాలోని దీన్ గ్రామానికి చెందిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అంతే కాదు ప్రభుత్వ ఉద్యోగం ఆఫర్ కూడా ఇచ్చింది. కానీ సరబ్‌జోత్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసుకునేందుకు తిరస్కరించాడు.

సరబ్జోత్ సింగ్ రైతులు జతీందర్ సింగ్, హర్దీప్ కౌర్ కుమారుడు. చండీగఢ్‌లో చదువు పూర్తి చేశాడు. అంతకుముందు సరబ్‌జోత్ సింగ్ 2019 జూనియర్ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. అదే సమయంలో, 2022 ఆసియా క్రీడల్లో భారత షూటింగ్ జట్టులో భాగంగా సరబ్జోత్ సింగ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది కాకుండా, సరబ్జోత్ సింగ్ ఆసియా క్రీడలలో భారతదేశానికి రజత పతకాన్ని అందించాడు. వీటన్నింటికి తోడు పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించి భారతదేశం గర్వపడేలా చేసిన సరబ్‌జోత్ సింగ్‌కు హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్ పదవిని కట్టబెట్టాయి. దీంతో పాటు రూ.2.50 కోట్ల నగదు బహుమతిని కూడా హర్యానా ప్రభుత్వం అందజేసింది. హర్యానా క్రీడా మంత్రి సంజయ్ సింగ్ ఈ అవార్డును ప్రకటించారు.

కానీ 22 ఏళ్ల సరబ్జోత్ సింగ్ హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు ఆఫర్ చేసిన ఉ ద్యోగాలను తిరస్కరించాడు. దీని వెనుక ఉన్న కారణాన్ని సరబ్‌జోత్ సింగ్ వివరిస్తూ, ‘ఉద్యోగం బాగానే ఉంది. కానీ నేను ఇప్పుడు అలా చేయడం కుదరదు. ముందుగా నా షూటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాను. మా కుటుంబం కూడా నన్ను ప్రభుత్వ ఉద్యోగం చేయమని అడుగుతోంది. కానీ నాకు షూటింగ్‌పై ఆసక్తి ఎక్కువ. కాబట్టి నా నిర్ణయాలలో కొన్నింటికి వ్యతిరేకంగా వెళ్లడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేయలేను’ అని సరబ్ జోత్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..