AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Khanna: సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? పాన్ మసాలా యాడ్స్ లో స్టార్ హీరోలు నటించడంపై ‘శక్తిమాన్’

స్టార్ హీరోలు సినిమాలతో పాటు పలు ప్రకటనల్లోనూ నటిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు. అయితే కొందరు బాలీవుడ్ హీరోలు ఈ మధ్యన పాన్ మసాలా యాడ్స్ లో ఎక్కువగా కనిపస్తున్నారు. వీరిపై సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్షయ్ కుమార్ , షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ రీసెంట్ గా టైగర్ ష్రాఫ్ కూడా పాన్ మసాలా యాడ్ లో కనిపించాడు

Mukesh Khanna: సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? పాన్ మసాలా యాడ్స్ లో స్టార్ హీరోలు నటించడంపై 'శక్తిమాన్'
Mukesh Khanna
Basha Shek
|

Updated on: Aug 11, 2024 | 11:35 PM

Share

స్టార్ హీరోలు సినిమాలతో పాటు పలు ప్రకటనల్లోనూ నటిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు. అయితే కొందరు బాలీవుడ్ హీరోలు ఈ మధ్యన పాన్ మసాలా యాడ్స్ లో ఎక్కువగా కనిపస్తున్నారు. వీరిపై సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్షయ్ కుమార్ , షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ రీసెంట్ గా టైగర్ ష్రాఫ్ కూడా పాన్ మసాలా యాడ్ లో కనిపించాడు. ఇటీవలే స్టార్ హీరో జాన్ అబ్రహం ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు. డైరెక్టుగా పేర్లు చెప్పకున్నా తనదైన శైలిలో పాన్ మసాలా హీరోలను విమర్శించాడు. తాజాగా టీవీ నటుడు, శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా కూడా ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు. గుట్కాలు, పాన్ మసాలా ప్రకటనల్లో కనిపిస్తోన్న అక్షయ్ కుమార్ , షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ తదితర నటులకు శక్తిమాన్ క్లాస్ తీసుకున్నారు.స్టార్ నటీనటులు భారీ రెమ్యునరేషన్ తీసుకుని ఇలాంటి ప్రకటనల్లో నటిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ముఖేష్ ఖన్నా ను అడిగితే ఈ విధంగా సమధానమిచ్చారు. ‘ఈ విషయంపై నేను అక్షయ్ కుమార్‌ను తిట్టాను. ఆయన ఆరోగ్యంపై అవగాహన ఉన్న వ్యక్తి. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్‌లతో కలిసి ఈ ప్రకటన చేసాడు. ఇలాంటి ప్రకటనలకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. దీనితో మీరు ప్రజలకు ఏం సందేశమిస్తున్నారు. తాము పాన్ మసాలా చేయడం లేదని, వక్కపొడి మాత్రమే విక్రయిస్తున్నామని చెబుతున్నారు. అయితే వాళ్లు ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా తెలుసు’ అని ముఖేష్ ఖన్నా మండిపడ్డరు.

‘మీరు కింగ్‌ఫిషర్‌కు ప్రచారం చేశారంటే, మీరు కింగ్‌ఫిషర్ బీర్‌ను విక్రయిస్తున్నారని అర్థం. అది అందరికీ తెలుసు. వీళ్లంతా ఇలా ఎందుకు ప్రచారం చేస్తారు? వాళ్ల దగ్గర డబ్బు లేదా? మీ దగ్గర డబ్బులు సరిపోతాయని, అలాంటి పనులు చేయవద్దని కూడా ఆ నటులకు చెప్పాను. అందులోంచి బయటకి వచ్చిన నటీనటులు తక్కువే. అలాంటి వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. నా సమాచారం సరైనదైతే, అమితాబ్ బచ్చన్ కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రకటనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మీరు గుట్కా తినమని ప్రజలకు నేర్పుతున్నారు. దయచేసి ఇలాంటివి చేయకండి’ అని ముఖేష్ ఖన్నా చెప్పుకొచ్చారు.

గతంలో ముఖేష్ ఖన్నాకు కూడా ఇలాంటి ప్రకటనలు వచ్చాయి. కానీ అతను దానిని తిరస్కరించాడు. ‘శక్తిమాన్’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా సూపర్‌హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్న నటుడు. చాలా విషయాలపై నేరుగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.