Aishwarya Rai: ఐశ్వర్యతో విడాకుల రూమర్లు.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్.. క్లారిటీ ఇచ్చేశాడుగా
బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి. 2007లో ప్రేమించి వివాహం చేసుకున్నారీ లవ్లీ కపుల్. 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. ఎంతో అనోన్యంగా ఉండే ఈ అందమైన జంట విడిపోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై ఐష్ కానీ, అభిషేక్ కానీ ఎవరూ స్పందించడం లేదు
బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి. 2007లో ప్రేమించి వివాహం చేసుకున్నారీ లవ్లీ కపుల్. 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. ఎంతో అనోన్యంగా ఉండే ఈ అందమైన జంట విడిపోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై ఐష్ కానీ, అభిషేక్ కానీ ఎవరూ స్పందించడం లేదు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి కూడా విడివిడిగా హాజరయ్యారు ఐశ్వర్య, అభిషేక్. దీంతో వీరి విడాకుల వార్తలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. తాజాగా అభిషేక్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఎట్టకేలకు నోరు విప్పాడు అభిషేక్. ఐశ్వర్యతో వస్తోన్న విడాకాల రూమర్స్‌పై తన దైన శైలిలో స్పందించాడు. ‘నేను దీని గురించి చెప్పడానికి మీరుఏమీ మిగల్చలేదు. మీరందరూ ఇప్పటికే ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేం సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటాం. నాకు పెళ్లయింది క్షమించండి’ అంటూ తన తన ఉంగరాన్ని చూపించాడు అభిషేక్. తద్వారా తమపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్ పెట్టాడీ బాలీవుడ్ హీరో.
అభిషేక్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో కొత్తదా? పాతదా అనేది మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల ప్రముఖ రచయిత్రి హీనా ఖండేవాలా ఒక పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ విడాకుల గురించి. దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదు’ అని. దీనికి అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అభిషేక్ జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందని చాలా మంది భావించారు. ఇలా అభిషేక్- ఐశ్వర్యల బంధంపై రూమర్లు రావడం ఈ మధ్యన పరిపాటిగా మారింది.
సోషల్ మీడియాలో వైరలవుతోన్న అభిషేక్ డీప్ ఫేక్ వీడియో ఇదే..
View this post on Instagram
అనంత్ అంబానీ పెళ్లిలో కూతురిలో ఐశ్వర్య రాయ్ బచ్చన్.. వీడియో
Aishwarya Rai with daughter Aradhya Bachchan at Anant Radhika Ambani Aashirwad ceremony… #AnantWedsRadhika Aishwarya Rai Bachchan Aishwarya Aishwarya Rai #AnantRadhikaWedding #AnantAmbani #radhikamerchant #ambaniwedding #AmbaniPreWedding #nitaambani #Amitabhbachchan #jaya pic.twitter.com/oZgKwmBAY7
— Ratika (@Ratika_workmode) July 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.