AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva Trailer: కంగువా ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ అదరగొట్టిన సూర్య.. యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ అంతే

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'కంగువా'. డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. యానిమల్ నటుడు బాబీ డియోల్ మరోసారి విలన్ గా కనిపించనున్నాడు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై

Kanguva Trailer: కంగువా ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ అదరగొట్టిన సూర్య.. యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ అంతే
Kanguva Trailer
Basha Shek
|

Updated on: Aug 12, 2024 | 3:23 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కంగువా’. డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. యానిమల్ నటుడు బాబీ డియోల్ మరోసారి విలన్ గా కనిపించనున్నాడు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై నిర్మాతలు జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి ఇది వరకే మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే రిలీజ్ కు రెండు నెలల ముందే కంగువా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ముందు నుంచి చెబుతున్నట్లుగానే కంగువా సినిమా విజువల్ వండర్ లా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రెండు తెగల మధ్య సాగే పోరాటాన్ని అద్భుత మైన యాక్షన్ సీక్వెన్స్ జోడించి శివ ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా సముద్రంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే నటనలో సూర్య అదరగొట్టాడు. అతని ఫైట్స్ కు థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మళ్లీ భయ పెట్టాడు. తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశాడు. ట్రైలర్ చివరిలో వచ్చే మొసలి సీన్ అయితే హైలెట్ అని చెప్పుకోవచ్చు.

కాగా కంగువా సినిమాలో మూడు పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమచారం. ఇందులో ఇప్పటికే రెండు లుక్స్ రివీల్ అయ్యాయి. ఇక ఇదే సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లాస్ట్ లో ఒక వ్యక్తి ఫేస్ ను చూపించలేదు మేకర్స్. బహుశా అతడు సూర్య తమ్ముడు కార్తీనే అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. కంగువా సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ట్రైలర్ లో బీజీఎమ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

కంగువా ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!