- Telugu News Photo Gallery Cinema photos Do you remember the top director in this photo? He is Ram Gopal Varma
ఈ ఫొటోలో ఉన్న తోప్ డైరెక్టర్‌ను గుర్తుపట్టారా.? ఆయన సినిమా అంటే ఫ్యాన్స్ కు పూనకాలే
సినిమా వాళ్లకు సంబందించిన ఫోటో కనిపిస్తే చాలు దాన్ని తెగ వైరల్ చేస్తుంటారు నెటిజన్స్. మరీ ముఖ్యంగా చైల్డ్ హుడ్ ఫోటోలను లేదా త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ ఆయన ఎవరో గుర్తుపట్టండి. ఈమె ఎవరో కనిపెట్టండి అంటూ.. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.
Updated on: Aug 12, 2024 | 2:48 PM

సినిమా వాళ్లకు సంబందించిన ఫోటో కనిపిస్తే చాలు దాన్ని తెగ వైరల్ చేస్తుంటారు నెటిజన్స్. మరీ ముఖ్యంగా చైల్డ్ హుడ్ ఫోటోలను లేదా త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ ఆయన ఎవరో గుర్తుపట్టండి. ఈమె ఎవరో కనిపెట్టండి అంటూ.. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

పై ఫొటోలో ఓ స్టార్ దర్శకుడు ఉన్నారు. ఆయన పేరు చెప్తే ఫ్యాన్స్కు పూనకాలు వస్తాయి. అంతలా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు తెరకెక్కించాడు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది.

ఆయన ఎవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివ లాంటి సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు ఆర్జీవీ. అలాగే ఆయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.

అలాగే ఆయన రాజకీయ నాయకుల బయోపిక్స్ తీసి మొన్నామధ్య వైరల్ అయ్యారు. ఆ తర్వాత అడల్ట్ సినిమాలు చేసి విమర్శలు కూడా కొనితెచ్చుకున్నారు. కానీ ఎప్పుడు ఆయన తన పనిని పక్కన పెట్టలేదు. ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆరాధ్య దేవి అనే హీరోయిన్ తో శారీ అనే సినిమా చేస్తున్నారు ఆర్జీవీ. ఈ సినిమాకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.