Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి బ్రహ్మముడి ‘కావ్య’.. హౌజ్‌లో అల్లరి మాములుగా ఉండదుగా.. రచ్చ రంబోలే

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుందీ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమాచారం.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి బ్రహ్మముడి 'కావ్య'.. హౌజ్‌లో అల్లరి మాములుగా ఉండదుగా.. రచ్చ రంబోలే
Bigg Boss 8
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2024 | 9:30 PM

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుందీ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమాచారం. గత ఏడాది కాలంగా నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న వారిని హౌజ్‌లోకి తెచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట. గత సీజన్లలో మాదిరి కాకుండా ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపుతున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. అలాగే కొందరి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వింధ్య విశాఖ, నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, నటి సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ.. హీరోయిన్ కుషితా కల్లపు.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. . ఇప్ప‌డు మ‌రో వార్త నెట్టంట తెగ వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. బిగ్‌బాస్ సీజ‌న్‌లోకి ఈ సారి బ్ర‌హ్మ‌ముడి సీరియల్ న‌టి కావ్య రాబోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళుతోన్న టీవీ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇందులోని కావ్య- రాజ్‌ జోడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక న‌టి కావ్య విషయానికి వస్తే.. ఆమె అస‌లు పేరు దీపికా రంగరాజ్. ఈమె కన్నడ నటి. ముందుగా ‘చిత్రం పేసుతాడి’ అనే తమిళ సీరియల్ లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మముడి సీరియల్ లో అవకాశం దక్కించుకుంది. ఈ సీరియల్ తో దీపికకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించే దీపిక చేసే అల్లరి, కామెడీ టైమింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ టీవీ షోలో పాల్గొన్న దీపికాతో శ్రీ‌ముఖి నిన్ను మ‌రో మూడు నెలల పాటు షోకు రానివ్వం’ అని అంది. దీంతో వెంట‌నే దీపికా ‘ఏంటీ నన్ను బిగ్ బాస్‌కు పంపిస్తారా’ అంటూ రిప్లై ఇచ్చింది.

దీంతో దీపిక నిజంగానే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతంద‌నే వార్త నెట్టంట హాల్‌చ‌ల్ చేస్తోంది. ఒకవేళ కావ్య వస్తే మాత్రం బిగ్ బాస్ లో అల్లరి మాములుగా ఉండదు. అయితే దీపిక బిగ్ బాస్ ఎంట్రీపై అటు దీపికా గానీ, బిగ్‌బాస్ మేక‌ర్స్ గానీ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇందులో నిజమెంత తెలియాలంటే బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..