Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయటపెట్టిన సమంత

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగి రెండు రోజులు గడిచిపోయింది. ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరగ్గా, అక్కినేని నాగార్జున ఎంగేజ్ మెంట్ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ఆ తర్వా శోభిత కూడా ఇదే ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.

Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయటపెట్టిన సమంత
Naga Chaitanya, Sobhita Dhulipala
Follow us
Basha Shek

|

Updated on: Aug 11, 2024 | 11:10 PM

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగి రెండు రోజులు గడిచిపోయింది. ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరగ్గా, అక్కినేని నాగార్జున ఎంగేజ్ మెంట్ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ఆ తర్వా శోభిత కూడా ఇదే ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఇదిలా ఉంటే ఉన్నట్లుండి నాగ చైతన్య, శోభితల నిశ్చితార్థం జరగడంపై చర్చ జరుగుతోంది. అలాగే వీరిద్దరు మొదట ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుసుకున్నారు? ప్రేమలో ఎలా పడ్డారు? అని నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. తాజాగా ఇదే విషయంపై శోభిత సోదరి సమంత ధూళిపాళ్ల తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. చైతన్య, శోభితల మధ్య ప్రేమ 2022లోనే మొదలైందని సమంత బయటపెట్టింది. చైతూ-శోభిత ఎంగేజ్‌మెంట్ ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె క్యాప్షన్ లో ఈ విషయాన్ని కూడా షేర్ చేసింది. 2022లోనే సమంత ధూళిపాళ్ల పోస్ట్ చేసిన ఓ ఫొటోకు నాగ చైతన్య లైక్ కూడా కొట్టాడు. అయితే అప్పుడు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదట. ఒకవేళ సరిగ్గా గమనించి ఉంటే.. శోభితతో ప్రేమ వ్యవహారం అప్పుడే బయటపడేదేమో? అని అనుకుంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

కాగా హీరోయిన్ సమంతని 2017లోనే నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే నాలుగేళ్లకే వీళ్ల బంధం బీటలు వారింది. 2021 అక్టోబరు 2న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత చైతూ-సమంత ఎవరికీ వాళ్లు సినిమాలు చేసుకుంటూ ప్రొఫెషల్ లైఫ్ లో బిజీ అయిపోయారు. కానీ గత కొన్నేళ్లుగా చైతన్య, శోభితలు ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారీ లవ్లీ కపుల్.

సమంత ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

నాగ చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!