AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blink OTT: తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. ఊహించని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే?

కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా సుపరిచితమే. దసరా సినిమాలో న్యాచురల్ స్టార్ నాని క్లోజ్ ఫ్రెండ్ గా నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం కన్నడలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు దీక్షిత్ శెట్టి. ఈ కోవలో అతను నటించిన చిత్రం బ్లింక్. ఈ ఏడాది మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ కన్నడలో సూపర్ హిట్ గా నిలిచింది

Blink OTT: తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. ఊహించని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే?
Blink Movie
Basha Shek
|

Updated on: Aug 12, 2024 | 8:07 PM

Share

కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా సుపరిచితమే. దసరా సినిమాలో న్యాచురల్ స్టార్ నాని క్లోజ్ ఫ్రెండ్ గా నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం కన్నడలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు దీక్షిత్ శెట్టి. ఈ కోవలో అతను నటించిన చిత్రం బ్లింక్. ఈ ఏడాది మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ కన్నడలో సూపర్ హిట్ గా నిలిచింది. కమర్షియల్ గానూ మంచి వసూళ్లను సాధించింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో శ్రీనిధి బ్లింక్ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి స్పందనే వచ్చింది. మే నెలాఖరున ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్లింక్ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే అప్పుడు కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. పైగా ఇతర కారణాలతో ఓటీటీ నుంచి బ్లింక్ సినిమాను తొలగించారు. ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చారు. కన్నడ వెర్షన్ తో పాటు తాజాగా తెలుగు వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు.

బ్లింక్ సినిమాలో దీక్షిత్ శెట్టితో పాటు చైత్ర జే ఆచార్, మందార బత్తలహళ్లి, గోపాలకృష్ణ దేశ్‍పాండే, వజ్రధీర్ జైన్, సురేశ్ అంగాలీ, కిరణ్ నాయక్, సౌమ్యశ్రీ మర్నాడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జననీ పిక్చర్స్ బ్యానర్ పై ఏజే రవీంద్ర బ్లింక్ సినిమాను నిర్మించారు. ప్రసన్న కుమార్ సంగీతం అందించారు. అనివాశ్ శాస్త్రి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. సినిమా కథ విషయానికి వస్తే.. పీజీలో ఫెయిల్ అయిన అపూర్వ(దీక్షిత్ శెట్టి) తల్లి దగ్గర ఈ విషయం దాచి పెడతాడు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్ లో సెటిల్ కావాలని కలలు కంటాడు. అయితే తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ అపూర్వ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే చాలు టైమ్ ట్రావెల్‌లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? అసలు ఇలా ఎందుకు జరిగింది? చివరకు ఏమైందన్నదే బ్లింక్ సినిమా. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి బ్లింక్ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..