AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khadgam: సినిమాలకు దూరంగా ఖడ్గం మూవీ హీరోయిన్.. ఇప్పుడేలా మారిపోయిందో తెలుసా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఖడ్గం ఒకటి. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే చాలు ఈ సినిమా కచ్చితంగా టీవీలో ప్రత్యక్షమైపోవాల్సిందే.  ఆగస్టు 15న స్కూల్స్, కాలేజీల్లో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఖడ్గం సినిమా పాటలు ఉండాల్సిందే.

Khadgam: సినిమాలకు దూరంగా ఖడ్గం మూవీ హీరోయిన్.. ఇప్పుడేలా మారిపోయిందో తెలుసా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Actress Kim Sharma
Basha Shek
|

Updated on: Aug 12, 2024 | 6:35 PM

Share

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఖడ్గం ఒకటి. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే చాలు ఈ సినిమా కచ్చితంగా టీవీలో ప్రత్యక్షమైపోవాల్సిందే.  ఆగస్టు 15న స్కూల్స్, కాలేజీల్లో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఖడ్గం సినిమా పాటలు ఉండాల్సిందే. 2002లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, బ్రహ్మాజీ, సోనాలి బింద్రే, కిమ్ శర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇదే సినిమాకు బెస్ట్ డైరెక్టర్ గా నంది పురస్కారం అందుకున్నాడు కృష్ణ వంశీ. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారు సోనాలిబింద్రే, మరొకరు కిమ్ శర్మ. అప్పటికీ వీరిద్దరూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లే. సోనాలి బింద్రే శ్రీకాంత్ ప్రియురాలిగా నటించగా, కిమ్ శర్మ మాత్రం శ్రీకాంత్ వెంట పడే అల్లరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ‘ముసుగు వేయద్దు మనసు మీద’ పాటలో కిమ్ శర్మ స్టెప్పులు అభిమానులను ఓ రేంజ్ లో అలరించాయి. ఖడ్గం తర్వాత రాజమౌళి- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మగధీరలో ఓ స్పెషల్ సాంగ్‌లో కిమ్ స్టెప్పులేసింది. అలాగే రవితేజ ఆంజనేయలు సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించింది. ఆఖరిగా యాగం అనే సినిమాలో కనిపించింది.

బాలీవుడ్ లోనూ 2011లో లూట్ అనే సినిమా తర్వాత ప్రేక్షకులకు కనిపించలేదు కిమ్ శర్మ. కిమ్ శర్మ అనగానే చాలా మందికి ప్రముఖ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ లవర్ అన్న ముద్ర పడింది. అయితే ఆమె 2010లో అనిల్ పుంజానీని పెళ్లి చేసుకుంది. అయితే ఈ దంపతులు 2016లో విడిపోయారు.

ఇవి కూడా చదవండి

 కిమ్ శర్మ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

దీని తర్వాత ప్రముఖ టాలీవుడ్ నటుడు హర్ష వర్దన్ ఠాణేతో కిమ్ శర్మ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌తోనూ ప్రేమలో పడిందీ అందాల తార. ఆ మధ్యన ఇద్దరూ కూడా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయట పెట్టారు. అయితే ఇప్పుడీ ప్రేమ బంధం కూడా బీటలు వారింది. గతేడాది తన సోషల్ మీడియా ఖాతాల నుంచి లియాండర్ పేస్ ఫొటోలను తొలగించింది కిమ్. దీంతో వీరిద్దరు విడిపోయారన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సింగిల్ గానే ఉంటోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..