Venu Swamy: అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?

Venu Swamy: అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?

Anil kumar poka

|

Updated on: Aug 16, 2024 | 12:59 PM

ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున.. వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ.. వీరిద్దరు కూడా ఇంకో మూడు సంవత్సరాల్లో విడిపోతారు అని.. అది కూడా ఒక అమ్మాయి వల్ల అంటూ ఒక వీడియో విడుదల చేశారు. అంతే.. వేణుస్వామికి మళ్లీ మొదలయ్యాయి చిక్కులు. బహుశా ఇప్పుడు ఏ గ్రహం ఆయన్ను పట్టి పీడిస్తుందో కానీ.. ఏం చేసినా వర్కౌట్ కావడం లేదు.

వేణుస్వామి.. ఈ పేరు తెలుసుగా. ?? ఆయన వీడియోస్ చూసుంటారుగా ?ఏది నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు విన్ అవుతారు అని చెప్పారు ఆ వీడియో నా??

ఓకే! మరి నాగచైతన్య-సమంత విడిపోతారు అని చెప్పిన వీడియో.. ఓ అదీ చూశారా ??

అదే నాగచైతన్య-శోభిత. వాళ్ళ జాతకాలు కలవట్లేదు,ఎంగేజ్మెంట్ ముహూర్తం సరిగ్గా లేదు అని చెప్పారు.2027 నుండి గొడవలు వస్తాయి వీళ్ళు కూడా విడిపోతారు అని చెప్పి వీడియో చేసారు. అది కూడా చూశారా.?

సరిగ్గా ఆ వీడియోతో మరోసారి వేణు స్వామి లైమ్ లైట్లోకొచ్చారు. సోషల్ మీడియాకు మరోసారి ఆయన దొరికిపోయారు. ట్రోలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ అలా ఉండగానే… తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్‌కు కంప్లైంట్ కూడా వెళ్లింది. ఈ కంప్లైంట్ ఇచ్చింది
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్..

బేసిక్ గా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పడంతో అప్పట్లో పాపులర్ అయ్యారు వేణు స్వామి.అయన అసలు పేరు పరాంకుశం వేణు. వేణు సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి రాజ‌కీయనాయకుల జ్యోతిష్యం వ‌ర‌కు ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ.. మీడియాకి ముడి సరుకవ్వడం ఆయన ప్రధానమై పని.

తాను చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా అని ..సెలబ్రిటీల గురించి చెబుతూ అనేక వీడియోలు విడుదల చేస్తూ వచ్చారు. గత కొద్దికాలం కిందట.. అసలు ప్రభాస్ కు ఇక విజయాలే రావు అంటూ కూడా జ్యోతిష్యం చెప్పారు. దీంతో డార్లింగ్ అభిమానులు చూస్తూ ఊరుకుంటారా… అందులోనూ సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్‌కి దొరికిపోయారు ఈ జాతకాల స్వామీజీ.

ఆ తర్వాత ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్‌పై ఆయన చెప్పిన జ్యోతిష్యం.. ఆ తర్వాత అది రివర్స్ అవడం.. దాంతో సారు.. మళ్లీ బుక్కైపోవడం గురించి ప్రత్యేకంగా గుర్తు చెయ్యక్కర్లేదనుకుంటా.

బహుశా ఇప్పుడు ఆయన జాతకం ఆయనే ఓ సారి చూసుకుంటే మంచిదేమో.. అయినా… ఇతరుల విషయాల్లో ఆయన చెప్పిన జాతకాలు అట్టర్ ప్లాప్ అవుతుంటే.. ఆయన విషయంలో మాత్రం నిజమవుతాయా ఏంటి…? ఏదో మన ఆశ కానీ. ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.