Manu Bhaker: బాబోయ్.! పిస్టల్ ధర రూ.కోటి.? అసలు విషయం చెప్పిన మను బాకర్

మను బాకర్.. పరిచయం అవసరం లేని అథ్లెట్.. ఇటీవలే జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో రెండు పతకాలు సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది.. మను బాకర్..అటు తన ప్రతిభతో ఇటు అందంతో కుర్రకారును ఆకట్టుకుంది ఈ యువ అథ్లెట్..చిన్న వయస్సులోనే షూటింగ్ విభాగంలో మను అడుగుపెట్టింది

Manu Bhaker: బాబోయ్.! పిస్టల్ ధర రూ.కోటి.? అసలు విషయం చెప్పిన మను బాకర్
Manu Bhaker
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 26, 2024 | 6:05 PM

మను బాకర్.. పరిచయం అవసరం లేని అథ్లెట్.. ఇటీవలే జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో రెండు పతకాలు సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది.. మను బాకర్..అటు తన ప్రతిభతో ఇటు అందంతో కుర్రకారును ఆకట్టుకుంది ఈ యువ అథ్లెట్..చిన్న వయస్సులోనే షూటింగ్ విభాగంలో మను అడుగుపెట్టింది. ఆమె ఒలిపింక్స్‌లో విజయం సాధించిన తర్వాత నుంచి జరిగిన ఏ పార్టీలకైనా, వేడుకలకైనా తాను సాధించిన మెడల్స్‌ను వెంటబెట్టుకొని తీసుకెళ్తుంది. ఈ విషయంపైన సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. ప్రతీ వేడుకకు మెడల్స్ తీసుకొని పోవడం అవసరమా? అంటూ కామెంట్స్ చేశారు. దానిపై మను బాకర్ కూడా స్పందించింది. తనని ఏ వేడుకకు వెళ్లిన అందరూ మెడల్స్ ఏవి అని అడుతున్నారని, అందుకే తను సాధించిన మెడల్స్‌ని తీసుకెళ్తున్నట్లు అమె సమాధానం ఇచ్చింది. ఇదిలా ఉంటే మను బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో వాడిన పిస్టల్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. పిస్టల్‌ ధర కోటి రూపాయలు ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు కోటి కన్నా ఎక్కువే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో మను బాకర్‌ను ట్యాగ్ చేసి పిస్టల్‌‌కి ఎంత ధర ఉంటుందని ఆమెనే అడుగుతున్నారు.

తాజాగా పిస్టల్ ధరపై మను బాకర్ స్పందించింది. అందరూ ఊహించుకున్నంత ధర ఉండదన్నారు.  పిస్టల్ ధర కోటి కాదని, తాను వాడిన పిస్టల్ రూ.1.5 లక్షల నుంచి రూ. 1.85 లక్షల వరకు ఉండొచ్చని చెప్పారు. ఆ పిస్టల్‌ను ఒకేసారి కొనుగోలు చేసినట్లు, ధరలో ఉంటే కొంచెం అటు ఇటు తేడా ఉండవచ్చని, మెడల్ బట్టి ధర అనేది మారుతూ ఉంటుందని, మళ్లీ అందులో కొత్త దానికి ఒక్క రేటు, సెకండ్ హ్యాండ్‌కి మరో రేటు ఉంటుందని, క్రీడాకారులకు కొన్ని కంపెనీలు ఉచితంగా కూడా పిస్టళ్లను అందిస్తాయని ఆమె పేర్కొన్నారు. అలాగే కొపం వచ్చినప్పుడు ఎలా ఉంటారనే ప్రశ్నకు కూడా ఆమె స్పందించింది. తనకు షూటింగ్ అంటే చాలా ఇష్టమని, ఎప్పుడూ షూటింగ్ చేస్తునే ఉంటానని, దేశం కోసం మరిన్ని పతకాలు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని, తను కూడా కొన్ని సార్లు ఆగ్రహానికి లోనవుతానని, కానీ తాను అందులో నుంచి పాజిటివ్‌నే నెర్చుకోవడానికి చూస్తానని, ఇది అథ్లెట్‌గా ఇంపార్టెంట్ ప్రాసెస్ అని చెప్పారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి