AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ‘ఛీ..ఛీ.. మనుషులేనా?’ రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోకుండా.. వీడియో

తోటి ప్రాణికి హాని కలిగితే మూగజీవాలు, పక్షులు గుంపులుగా చేరి సానుభూతి చూపించడం గమనిస్తూనే ఉంటాం. అవి మరణించినప్పుడు కళేబారాల వద్ద చక్కర్లు కొడుతూ కోలాహలం చేస్తుంటాయి. నోరు లేని మూగ జీవాలే సాటి ప్రాణుల పట్ల ఇంతటి దయార్ధ హృదయంతో ఉంటే.. జవసత్వాలు ఉన్న మనిషి మాత్రం జంతువుల కంటే హీనంగా ప్రవర్తించడం ప్రాణికోటికే అవమానకరం. ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడటానికి బదులు..

Watch Video: 'ఛీ..ఛీ.. మనుషులేనా?' రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోకుండా.. వీడియో
Ghaziabad People Loot Milk
Srilakshmi C
|

Updated on: Aug 07, 2024 | 12:05 PM

Share

గాజియాబాద్‌, ఆగస్టు 7: తోటి ప్రాణికి హాని కలిగితే మూగజీవాలు, పక్షులు గుంపులుగా చేరి సానుభూతి చూపించడం గమనిస్తూనే ఉంటాం. అవి మరణించినప్పుడు కళేబారాల వద్ద చక్కర్లు కొడుతూ కోలాహలం చేస్తుంటాయి. నోరు లేని మూగ జీవాలే సాటి ప్రాణుల పట్ల ఇంతటి దయార్ధ హృదయంతో ఉంటే.. జవసత్వాలు ఉన్న మనిషి మాత్రం జంతువుల కంటే హీనంగా ప్రవర్తించడం ప్రాణికోటికే అవమానకరం. ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడటానికి బదులు, వారివద్ద విలువైన వస్తువులు చోరీ చేసి పారిపోయిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే పలు మార్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అటువంటి ఘటన మరోమారు చోటు చేసుకుంది. రోడ్డు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్‌ను, ప్రాణాలతో పోరాడుతున్న క్లీనర్‌ను పట్టింకుకోకుండా వీళ్లేం చేశారో మీరే చూడండి…

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రోడ్డుపై ప్రమాదానికి గురైన పాల ట్యాంకర్‌ను స్థానికులు లూటీ చేశారు. ఏబీఈఎస్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని రహదారిపై పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్ ప్రేమ్ సింగ్ (45) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి మేరఠ్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో లారీ నుజ్జనుజ్జవగా.. పాల ట్యాంకర్‌ సైతం దెబ్బతినడంతో పాలు బయటకు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

రోడ్డుపై ఏరులై పారుతున్న పాలను చూసిన స్థానకులు డబ్బాలు, బాటిళ్లు నింపే పనిలో పడ్డారు. ప్రాణాలతో పోరాడుతున్న క్లీనర్‌ను గానీ, అక్కడే పడి ఉన్న డ్రైవర్‌ మృతదేహాన్ని గానీ ఎవరూ పట్టించుకోలేదు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్తా వైరలైంది. స్థానికుల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మనుషులనే విషయాన్ని మరిచిపోయారా అంటూ తిట్టిపోస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన క్లీనర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..