US woman: అమెరికా మహిళ కేసులో ఊహించని ట్విస్ట్‌..! ఇనుప గొలుసులతో తానే చెట్టుకు కట్టేసుకుందట! నివ్వెరబోయిన ఖాకీలు

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అటవీప్రాంతంలో చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టేసి, అధ్వాన స్థితిలో కనిపించిన 50 యేళ్ల అమెరికా మహిళ కేసు ఊహించని ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. చెట్టుకు ఇనుప గొలుసులతో తనకుతానే బంధించుకుందని, ఇతరుల ప్రమేయం లేదని సదరు మహిళ పోలీసులకు వెల్లడించింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త, కుటుంబం కూడా లేదని తెలిపింది..

US woman: అమెరికా మహిళ కేసులో ఊహించని ట్విస్ట్‌..! ఇనుప గొలుసులతో తానే చెట్టుకు కట్టేసుకుందట! నివ్వెరబోయిన ఖాకీలు
US Woman Found In Maharashtra Jungle
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 06, 2024 | 11:51 AM

ముంబై, ఆగస్టు 6: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అటవీప్రాంతంలో చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టేసి, అధ్వాన స్థితిలో కనిపించిన 50 యేళ్ల అమెరికా మహిళ కేసు ఊహించని ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. చెట్టుకు ఇనుప గొలుసులతో తనకుతానే బంధించుకుందని, ఇతరుల ప్రమేయం లేదని సదరు మహిళ పోలీసులకు వెల్లడించింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త, కుటుంబం కూడా లేదని తెలిపింది. ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక ఆస్పత్రిలో మహిళ చికిత్స పొందుతుంది. సోమవారం (ఆగస్టు 5) పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

జులై 27వ తేదీన మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టివేసి ఉన్న మహిళను ఓ గొర్రెల కాలరి గుర్తించాడు. ఆకలితో అలమటిస్తూ, వర్షంలో తడిసి నీరసించిపోయిన స్థితిలో మహిళ కనిపించింది. ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని, ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త గంటల వ్యవధిలోనే దేశ మంతటా దావానంలా వ్యాపించింది. దీంతో సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. ఈ క్రమంలో సింధుదుర్గ్ పోలీసులు శనివారం (ఆగస్టు 3) మహిళ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆమె మూడు తాళాలు, ఇనుప గొలుసును తెచ్చుకుంది. ముంబైకి 460 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో తాళాల్లో ఒకదానితో తానకు తానే గొలుసులతో చెట్టుకు కట్టేసుకుని తాళం వేసుకుంది. అనంతరం తాళం చెవిని తనకు కొన్ని మీటర్ల దూరంలో విసిరేసింది. ఆ తాళాలను పోలీసులు కనుగొన్నారు. అయితే, ఆ చెట్టుకు కట్టేసుకొని ఎన్ని రోజులుగా ఆమె అక్కడ ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని సింధూదుర్గ్‌ పోలీసులు వెల్లడించారు.

విచారణలో ఆమె తల్లి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలిసిందన్నారు. కానీ, ఇప్పటివరకు ఆమె కుటుంబ సభ్యులెవరూ తమను సంప్రదించలేదన్నారు. ఆమె ఉన్నట్లుండి భయభ్రాంతులకు గురవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రత్నగిరిలోని మానసిక ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమెను అటవీ ప్రాంతం నుంచి రక్షించిన తర్వాత ఆమె బ్యాగ్‌లో ఓ లేఖను పోలీసులు గుర్తించారు. అందులో తన మాజీ భర్త ఇందుకు కారణమని పేర్కొంది. అయితే ఆమె మాజీ భర్త పేరు అందులో పేర్కొనలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు మొదలుపెట్టారు. అలాగే ఆమె పేరు లలితా కయీ కుమార్‌ (50) అని ఆమె వద్ద ఉన్న అమెరికా పాస్‌పోర్ట్ ఫోటోకాపీ ద్వారా తెలుసుకున్నారు. దీనితోపాటు తమిళనాడు చిరునామాతో కూడిన ఆధార్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద గడువు ముగిసిన వీసా కాపీ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.