AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Padesh: ఆర్టీసీ బస్సులో కన్న బిడ్డ మరణం.. పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లిన కన్నపేగు!

అసలే పేదరికం.. ఆపై ఆజ్ఞానం.. వెరసి పిచ్చి కుక్క కరచినా కుమారుడుకి వ్యాక్సిన్‌ వేయించలేదు ఆ గిరిజన దంపతులు. తీవ్ర అనారోగ్యం పాలైన కుమారుణ్ని భుజాన వేసుకుని వందల కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి పరుగు పరుగున తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో బిడ్డ చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. చివరికి డాక్టర్లు చేతులెత్తేయడంతో చేసేది లేక పుట్టెతు దుఃఖంతో సొంతూరికి..

Andhra Padesh: ఆర్టీసీ బస్సులో కన్న బిడ్డ మరణం.. పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లిన కన్నపేగు!
Parents With Their Son's Dead Body
Srilakshmi C
|

Updated on: Aug 05, 2024 | 1:21 PM

Share

అరకులోయ, ఆగస్టు 5: అసలే పేదరికం.. ఆపై ఆజ్ఞానం.. వెరసి పిచ్చి కుక్క కరచినా కుమారుడుకి వ్యాక్సిన్‌ వేయించలేదు ఆ గిరిజన దంపతులు. తీవ్ర అనారోగ్యం పాలైన కుమారుణ్ని భుజాన వేసుకుని వందల కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి పరుగు పరుగున తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో బిడ్డ చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. చివరికి డాక్టర్లు చేతులెత్తేయడంతో చేసేది లేక పుట్టెతు దుఃఖంతో సొంతూరికి పయనమయ్యారు. కానీ ఆర్టీసీ బస్సెక్కి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గంమధ్యలోనే కుమారుడు చనిపోయాడు. దీంతో కుమారుడి మృతదేహంతో బస్సు దిగి.. ఊరి కాని ఊర్లో ఏం చేయాలో తెలియక రోడ్డు పక్కన దీనంగా కూర్చొని మౌనంగా విలపించిన ఘటన ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. వివరాల్లోకెళ్తే..

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం తీములబంధ గ్రామానికి చెందిన కొర్రా సుబ్బారావు కుమారుడు కార్తీక్‌(13)ను ఇటీవల కుక్క కరిచింది. అయితే బాలుడికి తల్లిదండ్రులు వ్యాక్సిన్‌ వేయించలేదు. దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన కార్తిక్‌ను ఇటీవల చింతపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించాలని సూచించారు. దీంతో ఆదివారం (ఆగస్టు 3) విశాఖపట్నంలోని కేజీహెచ్‌కి బాలుడిని తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు 3 నెలల క్రితం కుక్క కరచినా.. వ్యాక్సిన్‌ వేయించుకోలేదని తెలుసుకున్నారు.

అప్పటికే ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు కుమారుణ్ని ఇంటికి తీసుకెళ్లేందుకు తిరుగు పయణమయ్యారు. దీంతో ఆదివారం విశాఖపట్నంలో అరకులోయ కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అరకులోయ చేరుకునేలోపే ముందే మార్గంమధ్యలోనే కార్తీక్‌ కన్నుమూశాడు. బిడ్డ చనిపోయాడని గుర్తించిన తల్లిదండ్రులు అరకులోయలో బస్సు దిగి, ఒడిలో కన్నబిడ్డ మృతదేహంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన విలపిస్తూ కనిపించారు. గమనించిన స్థానికులు తలాకొంత ఆర్థికసాయం చేశారు. ఆనోటా ఈనోటా పడి ఈ విషయంకాస్తా అరకు ఎంపీ తనూజారాణి దృష్టికి వెళ్లడంతో.. ఆమె అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.