AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొంపముంచిన సరదా.. సెల్ఫీ తీసుకుంటూ 60 అడుగుల లోయలో పడిపోయిన యువతి! వైరల్ అవుతోన్న వీడియో

మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా చెట్లన్నీ చిగురించి, పచ్చగా కనువిందు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన థేఘర్‌కు పర్యటకులు భారీగా పోటెత్తుతున్నారు. శనివారం పూణెకు చెందిన కొందరు థోస్‌ఘర్ జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. పూణెలోని వార్జేకు చెందిన నస్రీన్ అమీర్ ఖురేషీ (29) అనే యువతి బోరాన్ ఘాట్ వద్ద..

Viral Video: కొంపముంచిన సరదా.. సెల్ఫీ తీసుకుంటూ 60 అడుగుల లోయలో పడిపోయిన యువతి! వైరల్ అవుతోన్న వీడియో
Pune Girl Slips Into 60 Foot Gorge
Srilakshmi C
|

Updated on: Aug 04, 2024 | 5:01 PM

Share

ముంబై, ఆగస్టు 4: మహారాష్ట్రలోని ప్రముఖ పర్యటక ప్రదేశం బోరాన్‌ ఘాట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు 60 అడుగుల లోయలో పడిపోయింది. ఈ సంఘటన శనివారం (ఆగస్టు 3) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా చెట్లన్నీ చిగురించి, పచ్చగా కనువిందు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన థేఘర్‌కు పర్యటకులు భారీగా పోటెత్తుతున్నారు. శనివారం పూణెకు చెందిన కొందరు థోస్‌ఘర్ జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. పూణెలోని వార్జేకు చెందిన నస్రీన్ అమీర్ ఖురేషీ (29) అనే యువతి బోరాన్ ఘాట్ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు యత్నించింది. అంతలో జారి 60 అడుగుల లోతైన లోయలో అమాంతం పడిపోయింది. అక్కడే ఉన్న హోంగార్డు, స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. అనంతరం యువతిని చికిత్స నిమిత్తం సతారాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

సతారా జిల్లాలో అధిక వర్షాల కారణంగా మట్టి జారుడుగా ఉండటంతో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆ జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు పర్యాటక ప్రాంతాలు, జలపాతాలను మూసివేయాలని ఆయన ఆదేశించారు. పర్యటక ప్రాంతాల సందర్శనకు వచ్చిన వారు ప్రమాదకర ప్రదేశాల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి నస్రీన్ లోయలో పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సోషల్ మీడియా ఫేమ్ కోసం ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ.. తరచూ యువత ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.