TG Job Calendar 2024-25: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 2) జాబ్‌ క్యాలెండర్‌ 2024-25ను విడుదల చేసింది. మొత్తం 20 రకాల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ వివరాలను ఇందులో పొందుపరిచింది. ఇందులో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసే నెలతోపాటు, నియామక పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు, పరీక్ష నిర్వహించే బోర్డు, ఉద్యోగ అర్హతలు..

TG Job Calendar 2024-25: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
TG Job Calendar
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 02, 2024 | 7:12 PM

హైదరాబాద్‌, ఆగస్టు 2: ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 2) జాబ్‌ క్యాలెండర్‌ 2024-25ను విడుదల చేసింది. మొత్తం 20 రకాల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ వివరాలను ఇందులో పొందుపరిచింది. ఇందులో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసే నెలతోపాటు, నియామక పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు, పరీక్ష నిర్వహించే బోర్డు, ఉద్యోగ అర్హతలు.. వంటి తదితర వివరాలను పొందుపరిచారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క ఈ రోజు అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారు.

2024-25 జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏయే పోస్టులు ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారంటే..

  • టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27, 2024 జరుగుతాయి (నోటిఫికేషన్‌ తేదీ: ఫిబ్రవరి 2024)
  • టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17-18, 2024 జరుగుతాయి (నోటిఫికేషన్‌ తేదీ: డిసెంబర్ 2022)
  • ల్యాబ్ టెక్/నర్స్/ఫార్మసిస్ట్ పరీక్ష నవంబర్ 2024లో జరుగుతుంది (నోటిఫికేషన్‌ తేదీ: సెప్టెంబర్ 2024)
  • టీజీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టులకు డిసెంబర్ 2024లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: డిసెంబర్ 2022)
  • TG TRANSCOలో ఇంజనీర్‌ పోస్ట్‌లకు జనవరి 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: అక్టోబర్ 2024)
  • గెజిటెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌ పోస్టులు జనవరి 25, 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: అక్టోబర్ 2024)
  • టెట్‌ పరీక్ష జనవరి 2025లో ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: నవంబర్ 2024)
  • టీజీపీఎస్సీ గ్రూప్ I-ప్రిలిమ్స్ ఫిబ్రవరి 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: అక్టోబర్ 2024)
  • గెజిటెడ్ స్కేల్‌ సర్వీసెస్‌ పోస్టులకు ఏప్రిల్ 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: జనవరి 2025)
  • DSC పరీక్షలు ఏప్రిల్ 2025లో ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: ఫిబ్రవరి 2025)
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు మే 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: ఫిబ్రవరి 2025)
  • టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జూన్ 2025లో ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: ఏప్రిల్ 2025)
  • టీజీపీఎస్సీ గ్రూప్ I-మెయిన్స్ అక్టోబర్ 2025లో ఉంటాయి (నోటిఫికేషన్‌ తేదీ: జులై 2025)
  • SI సివిల్ పోస్టులకు ఆగస్టు 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: ఏప్రిల్ 2025)
  • PC సివిల్ పోస్టులకు ఆగస్టు 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: ఏప్రిల్ 2025)
  • డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ పోస్టులకు సెప్టెంబర్ 2025న పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: జూన్ 2025)
  • గవర్నమెంట్ కాలేజీలలో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సెప్టెంబర్ 2025న పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: జూన్ 2025)
  • టీజీపీఎస్సీ గ్రూప్ II (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్‌తో సహా) పోస్టులకు అక్టోబర్ 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: మే 2025)
  • టీజీపీఎస్సీ గ్రూప్ III పోస్టులకు నవంబర్ 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: జులై 2025)
  • సింగరేణిలో పలు ఉద్యోగాలకు నవంబర్ 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: జూలై 2025)

తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.