Telangana: మీరు గ్రేట్ సార్.. ప్రభుత్వ పాఠశాలలో రోజూ పాఠాలు నేర్పుతున్న తహసీల్దార్..!

Nalgonda News: సేవ చేయాలనే తపన ఉంటే..ఏ పనైనా కష్టంగా కాకుండా ఇష్టంగా చేయవచ్చునని నిరూపిస్తున్నాడు ఓ ప్రభుత్వ అధికారి. నిత్యం విధుల్లో బీజీగా ఉండే ఆ అధికారి మాత్రం.. తన పని వేళలకు ముందు పాఠశాలలో బాలికలకు టీచింగ్ చేస్తున్నారు. టీచర్ అవతారం ఎత్తిన ఆ తహసీల్దార్... ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: మీరు గ్రేట్ సార్.. ప్రభుత్వ పాఠశాలలో రోజూ పాఠాలు నేర్పుతున్న తహసీల్దార్..!
Tahsildar
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 02, 2024 | 4:05 PM

నల్గొండ (02 ఆగస్టు 2024): రోజూ వారి విధులు సక్రమంగా నిర్వర్తించకుండా తప్పించుకునేందుకు కొందరు ఉద్యోగులు సాకులు వెతుక్కోవడం మనకు తెలిసిందే. కానీ సేవ చేయాలనే తపన ఉంటే..ఏ పనైనా కష్టంగా కాకుండా ఇష్టంగా చేయవచ్చునని నిరూపిస్తున్నాడు ఓ ప్రభుత్వ అధికారి. నిత్యం విధుల్లో బీజీగా ఉండే ఆ అధికారి మాత్రం.. తన పని వేళలకు ముందు పాఠశాలలో బాలికలకు టీచింగ్ చేస్తున్నారు. టీచర్ అవతారం ఎత్తిన ఆ తహసీల్దార్… ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

గద్వాల్‌ జిల్లా గట్టు గ్రామానికి చెందిన ముందరేటి శ్రీనివాస్‌ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. చదువుపై ఉన్న ఇష్టంతో కష్టపడి డిగ్రీ, బీఇడీ పూర్తి చేశాడు. పదేళ్ల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించారు. టీచర్ ఉద్యోగంతో శ్రీనివాస్ సంతృప్తి చెందలేదు. ప్రజా సేవ చేయాలని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే శ్రీనివాస్ తహసిల్దార్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు మండలాల్లో తహసీల్దార్‌గా ఆయన పని చేశాడు. ఇటీవల ప్రభుత్వం జరిపిన బదిలీల్లో శ్రీనివాస్ నల్లగొండ జిల్లా చందంపేట తాసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తహసిల్దార్ గా శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరాతీశాడు. అయితే పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ లేరని బాలికలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పాఠశాలకు రెగ్యులర్‌ టీచర్ల ఎంపిక జరిగేంత వరకు ఇంగ్లీష్ టీచింగ్ చేస్తానని బాలికలకు భరోసా ఇచ్చారు.

టీచర్‌గా తహసీల్దార్…

ఇచ్చిన మాట ప్రకారం.. తహసీల్దార్‌‌గా భూ సమస్యలతోపాటు ఇతర సమస్యలను అదిగమిస్తూనే శ్రీనివాస్ కార్యాలయ పనివేళలకు ముందు సమయాన్ని పాఠశాలకు కేటాయించి బాలికలకు బోధన చేస్తున్నారు. నిత్యం వీధులతో బిజీగా ఉంటూనే బాలికలకు విద్యా బోధన చేస్తుండటంతో తహసిల్దార్ శ్రీనివాస్‌ను విద్యార్థినిల తల్లిదండ్రులు, స్థానికులు అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..