Sitarama project: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రాయల్ రన్ సక్సెస్

కొద్ది రోజుల క్రితం అశ్వాపురంలో మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇపుడు రెండో పంప్ హౌజ్ సక్సెస్ అయ్యింది. మూడో పంపు హౌజ్ ట్రయల్ రన్ త్వరలో నిర్వహించి..ఈ నెలలో గోదావరి జలాలను సాగర్ లింక్ కెనాల్ కు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు పూర్తి చేస్తున్నారు.

Sitarama project: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రాయల్ రన్ సక్సెస్
Sitarama Project
Follow us
N Narayana Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 02, 2024 | 4:23 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి వరప్రదాయని అయిన సీతారామసాగునీటి ప్రాజెక్టు రెండో ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. ములకలపల్లి మండలం పూసుగూడెంలో ఉన్న రెండో పంప్ హౌజ్ ట్రయల్ రన్ నిర్వహించారు. 6 మోటార్లు కు గాను, ఒక్క మోటార్ ను ట్రయల్‌ వేసి 1500 క్యూసెక్కుల గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు అధికారులు. కొద్ది రోజుల క్రితం అశ్వాపురంలో మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇపుడు రెండో పంప్ హౌజ్ సక్సెస్ అయ్యింది. మూడో పంపు హౌజ్ ట్రయల్ రన్ త్వరలో నిర్వహించి..ఈ నెలలో గోదావరి జలాలను సాగర్ లింక్ కెనాల్ కు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు పూర్తి చేస్తున్నారు.