AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టేషన్ లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కైన ఖాకీ.. ఏసీబీ వలలో ఎస్ఐ

ఈమధ్య స్పీడ్ పెంచిన ఏసీబీ అధికారులు లంచాలకు రుచి మరిగిన అవినీతి అధికారులపై కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఎస్ఐ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇందుకు సహకరించిన కానిస్టేబుల్స్ తోసహా ఆ ఎస్ఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

స్టేషన్ లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కైన ఖాకీ.. ఏసీబీ వలలో ఎస్ఐ
Parvathagiri Si
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 02, 2024 | 4:13 PM

Share

ఈమధ్య స్పీడ్ పెంచిన ఏసీబీ అధికారులు లంచాలకు రుచి మరిగిన అవినీతి అధికారులపై కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఎస్ఐ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇందుకు సహకరించిన కానిస్టేబుల్స్ తోసహా ఆ ఎస్ఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్ఔఐ లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యాడు. గూగులోతు వెంకన్న అనే ఎస్ఐ, ఓ కేసు విషయంలో బదావత్ భాస్కర్ అనే వ్యక్తి వద్ద నుండి 40 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవల గుడుంబా తయారీ కోసం ఓ వాహనంలో బెల్లం తరలిస్తున్న క్రమంలో పోలీసులు భాస్కర్ ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ కేసు విషయంలో పట్టుబడ్డ వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ వెంకన్న 70 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. తొలుత 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఎస్ఐకి చెల్లించగా, మరో 40 వేల రూపాయల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ తతంగంలో ముందు నుంచి సహకరించిన ఎస్ఐ డ్రైవర్ సదానందాన్ని సైతం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

లంచం ఇవ్వడం ఇష్టం లేకే భాస్కర్ అనే బాధితుడు తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. అతని ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో ఎస్ఐని అరెస్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..