Credit Card: సక్రమంగా వాడుకుంటే… మిమ్మల్ని ఆదుకునే ఆపద్బాంధవుడు… అడ్డదిడ్డంగా వాడారో… నిలువునా ముంచేసే మహమ్మారి. బీ కేర్ ఫుల్!
రెండు మూడేళ్లుగా దేశంలో కోట్లాది క్రెడిట్ కార్డు హోల్టర్లలో కనీసం 30-40 శాతం మంది మినిమమ్ బిల్స్ కడుతూనే నెట్టుకొస్తున్నారు. దేశంలో రోజు రోజుకీ క్రెడిట్ కార్డుపై పెట్టే ఖర్చులు ఆకాశానికి అంటుతున్నాయి. అదే సమయంలో చేసిన అప్పుని సమయానికి కట్టలేక... మినిమమ్ బిల్స్ కట్టే వారి సంఖ్య, డీ ఫాల్టర్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ ఇంతగా లేదు

రమేష్.. గడిచిన ఆరేళ్లుగా క్రెడిట్ కార్డులు వాడుతున్నాడు. నాలుగేళ్ల పాటు అంతా సవ్యంగానే సాగింది. అతని జీతం కూడా లక్ష రూపాయలకు పైబడి రావడం, మంచి పేరున్న కంపెనీలో పని చెయ్యడంతో అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి క్యూలు కట్టాయి. చాలా వరకు వద్దంటూనే వచ్చాడు. అలా వద్దంటూ వచ్చిన తర్వాత కూడా ఓ 3 క్రెడిట్ కార్డులు మాత్రం ఆయన పర్సులో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఐదేళ్ల వరకు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ వచ్చాడు. ఎప్పుడూ డీఫాల్టర్‌గా లేడు కూడా. మినిమమ్ బిల్ కట్టే అలవాటు లేదు. కానీ ఏడాది క్రితం నుంచి పరిస్థితి కాస్త మారిపోయింది. ఆర్థికంగా వచ్చిన ఇబ్బందుల్ని క్రెడిట్ కార్డుల ఆదుకున్నప్పటికీ కూడా.. తర్వాత లక్షల్లో ఉన్న వాటి బిల్లుల్ని తిరిగి చెల్లించే పరిస్థితి రాక.. ఎప్పటికప్పుడు మినిమిమ్ బిల్స్ కడుతూ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అలా 2023 మే నెలలో ఓ క్రెడిట్ కార్డు ద్వారా సుమారు 2 లక్షలు మెడికల్ బిల్స్ చెల్లించిన ఆయన.. ఆ తర్వాత ఒకేసారి ఆ మొత్తం కట్టే పరిస్థితి లేక ఎప్పటికప్పుడు మినిమమ్ బిల్స్ చెల్లిస్తూ వచ్చాడు. చివరకు ఏడాది తిరిగేసరికి ఎంత కట్టానని లెక్కేసుకుంటే ఆయన తీసుకున్న మొత్తానికి మించి పోయింది. కానీ క్రెడిట్ కార్డుకు చెల్లించాల్సిన మొత్తం మాత్రం ఇంకా సుమారు 1,40,000 వేల వరకు ఉంది. అంటే ఇన్ని నెలలుగా ఆయన చెల్లించిన...




