- Telugu News Photo Gallery Banana Flower benefits: Banana flower has many health benefits from diabetes to anemia
Banana Flower: వర్షాకాలంలో ఆ రోగాలు దరిచేరకూడదంటే అరటి పువ్వు తినాల్సిందే.. ఎన్ని లాభాలో
అరటిపండు చాలా మందికి ఇష్టమైన పండు. ఇది తినడానికి ఎంత రుచిగా ఉంటుందో అంతే పోషకాలు ఉంటాయి. కానీ అరటిపండు మాత్రమే కాదు, అరటిపండు కంటే ముందే వచ్చే అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి పువ్వులో ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే విటమిన్ సి, ఎ, ఇ, పొటాషియం, ఫైబర్ వంటి వివిధ పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచడం నుంచి వివిధ శారీరక సమస్యలను పరిష్కరించడం..
Updated on: Aug 04, 2024 | 8:03 PM

అరటిపండు చాలా మందికి ఇష్టమైన పండు. ఇది తినడానికి ఎంత రుచిగా ఉంటుందో అంతే పోషకాలు ఉంటాయి. కానీ అరటిపండు మాత్రమే కాదు, అరటిపండు కంటే ముందే వచ్చే అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి పువ్వులో ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే విటమిన్ సి, ఎ, ఇ, పొటాషియం, ఫైబర్ వంటి వివిధ పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచడం నుంచి వివిధ శారీరక సమస్యలను పరిష్కరించడం వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.

అరటి పువ్వులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.

ఐరన్ అరటి పువ్వులో అధికంగా ఉంటుంది. ఈ అరటి పువ్వు హిమోగ్లోబిన్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది. కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే మీ డైలీ డైట్‌లో అరటి పువ్వు తీసుకోవాలి.

వర్షాకాలం అంటే జలుబు, ఫ్లూ సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలన్నింటిని నివారించడానికి ప్రతిరోజూ అరటి పువ్వు తింటే సరిపోతుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధులను నివారిస్తుంది. అరటి పువ్వులో చాలా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి మధుమేహ రోగులు అరటి పువ్వు తినకూడదు.

అరటి పువ్వును చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ దీనితో వివిధ రకాల రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో వివిధ శారీరక సమస్యలను నివారించడానికి మీ రోజువారీ ఆహారంలో అరటి పువ్వు తప్పక తీసుకోవాలి.




