Mossad Operation: టూత్‌పేస్ట్‌లో విషం కలిపి హతం.. గురితప్పని ‘మొస్సాద్‌’ సీక్రెట్ ఆపరేషన్లు!

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఇప్పట్లో సర్దుమనిగేలా కనిపించడం లేదు. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్ధి ఏ మూల నక్కిన ఇట్టే పసిగడుతుంది. అయితే తాజాగా హత్యకు గురైన హమాస్‌ అగ్రనేత హనియా ఉదంతంలో మొస్సాద్‌ పేరు హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్‌గానీ, మొస్సాద్‌గానీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించకపోయినా.. హతమార్చిన తీరు మాత్రం కచ్చితంగా మొస్సాద్‌నే..

Mossad Operation: టూత్‌పేస్ట్‌లో విషం కలిపి హతం.. గురితప్పని 'మొస్సాద్‌' సీక్రెట్ ఆపరేషన్లు!
Israel Palestine Conflict
Follow us

|

Updated on: Aug 04, 2024 | 7:46 PM

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఇప్పట్లో సర్దుమనిగేలా కనిపించడం లేదు. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్ధి ఏ మూల నక్కిన ఇట్టే పసిగడుతుంది. అయితే తాజాగా హత్యకు గురైన హమాస్‌ అగ్రనేత హనియా ఉదంతంలో మొస్సాద్‌ పేరు హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్‌గానీ, మొస్సాద్‌గానీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించకపోయినా.. హతమార్చిన తీరు మాత్రం కచ్చితంగా మొస్సాద్‌నే గుర్తుచేస్తోంది. అందుకు మరొక ఉదాహరణ 1978లో పాలస్తీనా కమాండర్ వాడి హద్దాద్ హత్య. ఈ ఘటనలో మొస్సాద్ ఏజెంట్లు విషపూరితమైన టూత్‌పేస్ట్ ద్వారా హద్దాద్‌ను హతమార్చారు. ఇలాంటి ఆపరేషన్లు మొస్సాద్‌కు షరా మామూలే. శత్రువులను వారి సొంతింట్లోనే హతమార్చిన సందర్భాలు మొస్సాద్‌ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇలీవల హనియాను కూడా అతడు బస చేసిన హోటల్‌లో ముందే బాంబు పెట్టి, గుట్టు చప్పుడు కాకుండా హతమార్చించింది. వీటన్నింటినీ చూస్తే గతంలో మొస్సాద్ చేపట్టిన ఆపరేషన్‌ ‘ఏజెంట్‌ స్యాడ్‌నెస్‌’ను తలపిస్తోంది.

ప్రత్యేక పాలస్తీనా కోసం పోరాడుతున్న సంస్థల్లో ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఫర్‌ ది లిబరేషన్‌ ఆఫ్‌ పాలస్తీనా’ ఒకటి. ఈ సంస్థ చీఫ్‌ వాడీ హద్దాద్‌ నేతృత్వంలో ఎన్నో దాడులు జరిగాయి. 1976లో ఎయిర్‌ ఫ్రాన్స్‌ హైజాక్‌ అందులో ఒకటి. హైజాకర్లు విమానాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి పారిస్‌కు తీసుకెళ్లారు. అనంతరం దాన్ని లిబియా, ఉగాండాకు మళ్లించారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోదరుడు లెఫ్టినెంట్ కల్నల్ యోనాటన్ నెతన్యాహు నేతృత్వంలోని రెస్క్యూ మిషన్ ‘ఆపరేషన్‌ థండర్‌బోల్ట్‌’తో తిప్పికొట్టింది. ఈ మిషన్‌ విజయం సాధించింది. కానీ లెఫ్టినెంట్ కల్నల్ నెతన్యాహు ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్.. ఎంటెబ్బే హైజాకింగ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ముఖ్యంగా హైజాకింగ్‌కు ప్రధాన సూత్రధారి అయిన వాడి హద్దాద్ వారి ప్రధాన లక్ష్యం. హద్దాద్‌ను హతమార్చడానికి అతని ఇంటినే ఎంచుకుంది. ఈ మిషన్‌కి మొస్సాద్‌ ‘ఏజెంట్ సాడ్‌నెస్’ అనే పేరు పెట్టింది.

‘ఏజెంట్ సాడ్‌నెస్’ అమలు ఇలా..

1978 జనవరి 10న ఏజెంట్‌ స్యాడ్‌నెస్‌.. హద్దాద్‌ రోజూ ఇంట్లో వాడే టూత్‌పేస్ట్‌ స్థానంలో ప్రత్యేకంగా తయారు చేసిన విషపు పేస్ట్‌ను ఉంచింది. దాన్ని ఇజ్రాయెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బయోలాజికల్‌ రీసెర్చ్‌లో తయారు చేశారు. ఈ పేస్ట్‌తో బ్రష్‌ చేసినప్పుడు అది శ్లేష్మ పొరల్లోకి చొచ్చుకుపోయి, క్రమంగా ప్రాణాంతకంగా మారుతుంది. ఈ పేస్ట్‌ వాడిన హద్దాద్‌ కొన్ని రోజుల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పొత్తి కడుపులో తీవ్ర నొప్పి, ఆకలి నశించటం, వేగంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించాయి. ఇరాక్‌ టాప్‌ వైద్యులెవ్వరూ అతని రోగాన్ని నయం చేయలేకపోయారు. శక్తిమంతమైన యాంటీబయోటిక్స్‌ సైతం పనిచేయలేదు. క్రమంగా జుట్టు ఊడిపోతుండటంతో.. అది విష ప్రయోగంగా వైద్యులకు అనుమానం వచ్చింది.

ఇవి కూడా చదవండి

పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ నేత యాసర్‌ అరాఫత్‌.. ఈస్ట్‌ జర్మన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ స్టాసీ సహయంలో హద్దాద్‌ను విమానంలో ఈస్ట్‌ బెర్లిన్‌కు తరలించారు. ‘అహ్మద్‌ డౌక్లీ’గా పేరు మార్చి రహస్యంగా ఓ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయితే అక్కడి వైద్యులు ఎన్ని వైద్య పరీక్షలు చేసినా, అతని అనారోగ్యానికి కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. మెదడులో తీవ్ర రక్తస్రావం, రక్త కణాలు పడిపోవటంతో హద్దాద్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో వైద్యులు అతడికి మత్తుమందు ఇచ్చి పది రోజులపాటు ఆస్పత్రిలో ఉంచారు. అయినా అతన్ని కాపాడలేకపోయారు. 1978 మార్చి 29న మరణించాడు.

ప్రొఫెసర్‌ ఒట్టో ప్రోకోప్ నిర్వహించని శవపరీక్షలో మెదడులో రక్తస్రావం, పాన్మిలోపతి వల్ల నిమోనియా వచ్చి మరణించినట్లు నిర్ధారించారు. ఆయన ఒంట్లోకి విషం ఎలా వెళ్లిందనేది మాత్రం నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. హదాద్‌ హత్యకు అసలు కారణం బయటికి రావడానికి 3 దశాబ్ధాలు పట్టింది. ఆరోన్‌ జె క్లెయిన్‌ అనే జర్నలిస్టు రాసిన స్ట్రైకింగ్‌ బ్యాక్‌ అనే పుస్తకంలో చాక్లెట్‌లో విషం కలిపి హద్దాద్‌ను హతమర్చినట్లు పేర్కొన్నారు. రోనెన్ బెర్గ్‌మాన్ అనే ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ రాసిన ‘రైజ్‌ అండ్‌ కిల్‌ ఫస్ట్‌’ పుస్తకంలో టూత్‌పేస్ట్‌లో విషయం కలవడం ద్వారా మృతి చెందినట్లు బహిర్గతం చేశారు. ఈ పుస్తకంలో ఆయన మొస్సాద్‌ నిర్వహించిన అనేక సీక్రెట్‌ ఆపరేషన్లను గురించి రాశారు. తాజాగా ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను కూడా ఇలాగే పక్కాప్లాన్‌తో మొస్సాద్‌ హత మార్చింది.

మరిన్ని అంతర్జాతీయ ఫొటోల కోసం క్లిక్‌ చేయండి.

టూత్‌పేస్ట్‌లో విషం కలిపి హతం.. గురితప్పని 'మొస్సాద్‌' ఆపరేషన్లు
టూత్‌పేస్ట్‌లో విషం కలిపి హతం.. గురితప్పని 'మొస్సాద్‌' ఆపరేషన్లు
వామ్మో.. ఈ దొంగలు మామూల్లోళ్లు కాదురా స్వామీ..!
వామ్మో.. ఈ దొంగలు మామూల్లోళ్లు కాదురా స్వామీ..!
ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా?ప్రాణ గండం నుంచి బయటపడిన టాలీవుడ్ హీరో
ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా?ప్రాణ గండం నుంచి బయటపడిన టాలీవుడ్ హీరో
గుర్తుకొస్తున్నాయి.. అంటూ కేంద్ర మంత్రి ఫ్రెండ్ షిప్ డే సందడి!
గుర్తుకొస్తున్నాయి.. అంటూ కేంద్ర మంత్రి ఫ్రెండ్ షిప్ డే సందడి!
మరో రెండు నెలలు ఆ రాశుల వారికి మంచి రోజులు..!
మరో రెండు నెలలు ఆ రాశుల వారికి మంచి రోజులు..!
రాత్రి నిద్రిస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఎంత దూరంలో ఉంచాలి?
రాత్రి నిద్రిస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఎంత దూరంలో ఉంచాలి?
ఘనంగా తీజ్ వేడుకలు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన యువతులు..
ఘనంగా తీజ్ వేడుకలు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన యువతులు..
ఇంట్లో భార్యను చంపి.. బిల్డింగ్‌పై నుంచి దూకి భర్త సూసైడ్‌!
ఇంట్లో భార్యను చంపి.. బిల్డింగ్‌పై నుంచి దూకి భర్త సూసైడ్‌!
మీ జీమెయిల్ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేశారా? ఇలా తెలుసుకోండి!
మీ జీమెయిల్ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేశారా? ఇలా తెలుసుకోండి!
ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన నదులు..!
ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన నదులు..!