Bangladesh: మళ్లీ భగ్గుమన్న బంగ్లాదేశ్‌.. 91 మంది మృతి, విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కాదు.. ఉగ్రవాదులంటున్న ప్రధాని షేక్ హసీనా

ప్రధానమంత్రి షేక్ హసీనా తన వ్యక్తిగత నివాసం గణభబన్‌లో భద్రతా వ్యవహారాలపై జాతీయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి... తాజా పరిస్థితిని సమీక్షించారు. నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కాదు.. ఉగ్రవాదులని షేక్‌ హసీనా అన్నారు. ఆందోళన కారులకు గట్టి సమాధానం ఇవ్వాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే బంగ్లాదేశ్‌ని 15 ఏళ్లకు పైగా పాలిస్తూ ఈ ఏడాది జనవరిలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చిన హసీనాకు ఈ నిరసనలు పెను సవాలుగా మారాయి.

Bangladesh: మళ్లీ భగ్గుమన్న బంగ్లాదేశ్‌.. 91 మంది మృతి, విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కాదు.. ఉగ్రవాదులంటున్న ప్రధాని షేక్ హసీనా
Bangladesh Protestes
Follow us
Surya Kala

|

Updated on: Aug 05, 2024 | 7:11 AM

బంగ్లాదేశ్‌ అట్టుడుకుతోంది. ఆ దేశంలో చెలరేగిన నిరసన జ్వాలలు ఇంకా ఆరలేదు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌ అల్లకల్లోలమవుతోంది. నిరసనలను అణిచివేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను కూడా ప్రయోగించాల్సి వస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ భారతీయులను అప్రమత్తం చేసింది.

రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఆదివారం అధికార పార్టీ మద్దతుదారులకు, ఆందోళనకారుల మధ్యన జరిగిన ఘర్షణలతో బంగ్లాదేశ్ రణరంగాన్ని తలపిస్తోంది. ఈ హింసాత్మక ఘటనల్లో 90 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. మరణించినవారిలో 14 మంది పోలీసులు ఉన్నారు. వీరిలో 13 మంది పోలీసులు సిరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో సజీవదహనమయ్యారు. ఆందోళనలో ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయి.

మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. నిరసనకారులు పలుచోట్ల వాహనాలను తగలబెట్టారు. రాజధాని ఢాకా ప్రాంతంలో వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకొచ్చి విధ్వంసం సృష్టించారు. నిరసన తెలపడం, షాపులకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రనేడ్స్ కూడా ఉపయోగించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గత నెలలో నిరసనలు మొదలుకాగా.. దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూను విధించడం ఇదే తొలిసారి. మరోవైపు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలపై సైతం ఆంక్షలు విధించారు. 4జీ సేవలు నిలిపివేయాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

విద్యార్ధుల పేరుతో ఉగ్రవాదులే విధ్వంసం సృష్టిస్తున్నరన్న ప్రధాని షేక్ హసీనా

బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం 1971లో జరిగిన యుద్ధంలో అమరులైన వారి వారసులకు 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆ దేశంలో కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ రిజర్వేషన్లు ఎత్తివేసి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేయాలని ఆందోళన చేస్తున్నారు. గత నెలలో రేగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం చర్చల కోసం ఆహ్వానించినా… ఆందోళనకారులు తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించారు. అంతేకాకుండా ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ప్రధానమంత్రి షేక్ హసీనా తన వ్యక్తిగత నివాసం గణభబన్‌లో భద్రతా వ్యవహారాలపై జాతీయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి… తాజా పరిస్థితిని సమీక్షించారు. నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కాదు.. ఉగ్రవాదులని షేక్‌ హసీనా అన్నారు. ఆందోళన కారులకు గట్టి సమాధానం ఇవ్వాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే బంగ్లాదేశ్‌ని 15 ఏళ్లకు పైగా పాలిస్తూ ఈ ఏడాది జనవరిలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చిన హసీనాకు ఈ నిరసనలు పెను సవాలుగా మారాయి.

బంగ్లాదేశ్‌లోని భారత పౌరులను.. అప్రమత్తం చేసిన ఇండియన్ ఎంబసీ

బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస నేపధ్యంలో కొనసాగుతున్న పరిణామాల దృష్ట్యా తదుపరి నోటీసు వచ్చే వరకు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని భారతీయ పౌరులకు సూచించింది. అంతేకాదు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఇండియన్‌ ఎంబసీ అలర్ట్‌ జారీ చేసింది. బయటకు వెళ్ళే విషయంలో పరిమితులు పాటించాలని సూచించింది. భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది. సిల్హట్‌ లోని అసిస్టెంట్‌ హైకమిషన్‌ ఆఫ్‌ ఇండియా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.  ఢాకాలోని భారత హైకమిషన్‌ను వారి అత్యవసర ఫోన్ నంబర్‌ల 8801958383679, 8801958383680, 8801937400591: MEA ద్వారా సంప్రదించాలని సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ