Telangana: పోలీస్‌ స్టేషన్‌లో పందెం కోళ్ల వేలం పాట.. చూసేందుకు ఎగబడ్డ జనం!

పోలిసులకి చిక్కిన రెండు కోళ్ళని పోలిసు స్టేషనులో వేలం వేసారు. గత నెల ఇరవై‌ ఏడవ తేదిన కోడిపందాలు అడుతున్న సమయంలో రెండు కోళ్ళ తో పాటు ముగ్గురుని అరెస్టు చేసారు. పోలిసులు. కోర్టు అదేశాల ప్రకారం రెండు కోళ్ళకి వేలం వేసారు. ఈ వేలంలో 20 మంది పాల్గొన్నారు. దీంతో పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పోలిసు స్టేషనులో మంగళవారం హడవుడి నెలకొంది. కోళ్ళ ‌వేలం చూడడానికి స్థానికులు..

Telangana: పోలీస్‌ స్టేషన్‌లో పందెం కోళ్ల వేలం పాట.. చూసేందుకు ఎగబడ్డ జనం!
Pandem Kollu Auction
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Aug 06, 2024 | 12:31 PM

పెద్దపల్లి, ఆగస్టు 6: పోలిసులకి చిక్కిన రెండు కోళ్ళని పోలిసు స్టేషనులో వేలం వేసారు. గత నెల ఇరవై‌ ఏడవ తేదిన కోడిపందాలు అడుతున్న సమయంలో రెండు కోళ్ళ తో పాటు ముగ్గురుని అరెస్టు చేసారు. పోలిసులు. కోర్టు అదేశాల ప్రకారం రెండు కోళ్ళకి వేలం వేసారు. ఈ వేలంలో 20 మంది పాల్గొన్నారు. దీంతో పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పోలిసు స్టేషనులో మంగళవారం హడవుడి నెలకొంది. కోళ్ళ ‌వేలం చూడడానికి స్థానికులు తరలివచ్చారు. సహజంగా పోలిసు స్టేషనులో ఎలాంటి వేలాలు‌ ఉండవు. కానీ కోళ్ళ వేలం ఎలా ఉంటుందోనని స్థానికులు ఆసక్తి గా తిలకించారు. మొత్తం ఈ వేలం ప్రక్రియలో ఇరవై మంది పాల్గొన్నారు. మొదటి కోడిని వేలంపాటలో పురాణం సారయ్య అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ కోడిని 4000 రూపాయలు చెల్లించి దక్కించుకున్నాడు పురాణం సారయ్య. ఇక రెండో కోడిని వేలంపాటలో బోనాల సత్యనారాయణ దక్కించుకున్నాడు. రూ. 2500 రూపాయలకు దీనిని దక్కించుకున్నాడు.

ఈ వేలానికి వచ్చిన‌ డబ్బులని మంథని కోర్టులో డిపాజిట్ చేయనున్నారు పోలిసులు. ఇటీవల కాలంలో పెద్దపల్లి జిల్లాలో కోళ్ళ దొంగతనాలు పెరిగిపోయాయి. పందేలకి పనికివచ్చే కోళ్ళని టార్గెట్ చేస్తూ‌ దొంగతనాలు చేస్తున్నారు. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేలు ఆడుతున్నారు. ఈ క్రమం లోనే పోలిసులు దాడులు చేస్తున్నారు. ఈ దాడులలో దొరికిన‌ కోళ్ళ ని కోర్టు ఆదేశాల ప్రకారం బహిరంగ వేలం వేస్తున్నారు. కమాన్ పూర్ పీఎస్ లో కూడా రెండు కోళ్ళ కి వేలం వేసారు. అయితే.. పోలీస్ స్టేషన్ లో వేలం ప్రక్రియ స్థానికులకు చాలా వింత గా కనబడింది. ఈ విధంగా వేలం వేయడం ఎన్నడూ చూడలేదని అంటున్నారు. మొత్తానికి పోలీస్ స్టేషన్ నుంచి రెండు కోళ్లకు విముక్తి లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి