AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Scholarships: నీట్‌లో తక్కువ స్కోర్‌ సాధించారా? మరేం పర్వాలేదు.. ఈ స్కాలర్‌షిప్‌లతో MBBS చదువుకోవచ్చు

Scholarships for Low NEET Score: ఎట్టకేలకు నీట్‌ వివాదం సర్దుమనడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తక్కువ స్కోర్‌ పొందిన విద్యార్ధులు కోరుకున్న కాలేజీలో సీటు దొరుకుతుందో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇకపై ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే.. పేద విద్యార్ధులు డబ్బు చెల్లించి సీట్లు కొనుక్కునే స్థితిలో లేనివారి కోసం కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 100% ట్యూషన్ ఫీజును కవర్ చేస్తాయి...

NEET Scholarships: నీట్‌లో తక్కువ స్కోర్‌ సాధించారా? మరేం పర్వాలేదు.. ఈ స్కాలర్‌షిప్‌లతో MBBS చదువుకోవచ్చు
Scholarships For Medical Students
Srilakshmi C
|

Updated on: Aug 06, 2024 | 11:55 AM

Share

ఎట్టకేలకు నీట్‌ వివాదం సర్దుమనడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తక్కువ స్కోర్‌ పొందిన విద్యార్ధులు కోరుకున్న కాలేజీలో సీటు దొరుకుతుందో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇకపై ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే.. పేద విద్యార్ధులు డబ్బు చెల్లించి సీట్లు కొనుక్కునే స్థితిలో లేనివారి కోసం కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 100% ట్యూషన్ ఫీజును కవర్ చేస్తాయి. నేషనల్ ఎడ్యుకేషన్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో తక్కువ స్కోర్ సాధించిన వారికి ఇది పండగలాంటి వార్తే. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనలలో మార్పు కారణంగా NEET స్కోర్‌ ఇప్పుడు తప్పనిసరైంది. దీంతో వైద్య విద్య అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా NEET క్లియర్ చేయాల్సి వస్తుంది. వీరంతా స్కాలర్‌షిప్‌తో డాక్టర్‌ అవ్వాలనే కల నెరవేర్చుకోవచ్చు. స్కాలర్‌షిప్‌లు అందించే కాలేజీల వివరాలు మీ కోసం..

హార్వర్డ్ మెడికల్ స్కూల్

హార్వర్డ్ మెడికల్ స్కూల్.. ఎండోడ్ ఫండ్స్, ఫండ్ రైజింగ్, అన్‌రిస్ట్రిక్టెడ్‌ ఇన్‌కాం ద్వారా స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఫీజు చెల్లించడానికి ఆర్థికంగా స్తోమతలేని పేది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మెడికల్‌ ప్రవేశ పరీక్షలో అర్హత పొంది ఉండాలి. ఈ స్కాలర్‌షిప్ కింద 8 సెమిస్టర్ల వరకు పూర్తి ట్యూషన్ ఛార్జీలను ఉచితంగా చెల్లిస్తుంది. ప్రిమెడికల్ నేపథ్యం, ​నివాస ప్రాధాన్యతలు, వ్యక్తిగత, వృత్తిపరమైన ఆసక్తులతోపాటు విద్యాపరమైన పురోగతితో కూడిన సమాచారాన్ని దరఖాస్తు సమయంలో సమర్పించవల్సి ఉంటుంది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్కాలర్‌షిప్‌ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

ఇవి కూడా చదవండి

ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (DST) యూజీ, పీసీ కోర్సులతో సహా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు INSPIRE స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 5 వేల స్టైఫండ్, సంవత్సరానికి రూ. 20 వేల విలువైన మెంటర్‌షిప్ గ్రాంట్‌ను అందిస్తుంది. కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రకల్చర్‌, వెటర్నరీ సైన్సెస్‌ సహా బేసిక్‌, అప్లైడ్‌ సైన్స్‌లలో కెరీర్‌ను కొనసాగించడానికి ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి రాష్ట్ర లేదా సెంట్రల్ బోర్డులో టాప్ 1 స్కోర్‌ సాధించిన అభ్యర్థులు అర్హులు. అలాగే నీట్ లేదా జేఈఈలో 10 వేల లోపు ర్యాంక్ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

INSPIRE స్కాలర్‌షిప్‌ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

బీజింగ్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్‌లు

చైనా భారతీయ విద్యార్థుతు మెడిసిన్‌ చదవడానికి అనువైన మార్గాలలో ఇది ఒకటి. భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు చైనా ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. పీహెచ్‌డీని అభ్యసించాలనుకునే 40 ఏళ్లలోపు అంతర్జాతీయ విద్యార్థులు, యూజీ కోర్సులకు 30 ఏళ్లలోపు వయసున్న వారు, మాస్టర్స్ డిగ్రీలో 35 ఏళ్లలోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కోర్సు ప్రారంభానికి మూడు నెలల ముందు సమర్పించాల్సిన దరఖాస్తులను హోస్ట్ సంస్థ సమీక్షిస్తుంది. విద్యార్థుల అకడమిక్ రికార్డు, ఆరోగ్యం, పని అనుభవం వంటి ఇతర అంశాలు ధృవీకరిస్తారు.

బీజింగ్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్‌ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

ఆల్ ఇండియా యూత్ స్కాలర్‌షిప్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AIYSEE)

AIYSEE అనేది ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థుల జాతీయ స్థాయి మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్ ప్రవేశ పరీక్ష. దీనిని సాధారణంగా ఏప్రిల్, మేలో నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్ధుల్లో కేవలం 10% మందికి మాత్రమే స్కాలర్‌షిప్ అందిస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల ప్రతి సెమిస్టర్‌కు 100 శాతం స్కాలర్‌షిప్ లేదా గరిష్టంగా రూ. 40 వేల వరకు అందిస్తారు. ప్రైవేట్ కాలేజీల్లో సంవత్సరానికి రూ. 80 వేల వరకు గ్రాంట్ లభిస్తుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

AIYSEE స్కాలర్‌షిప్‌ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

వైస్-ఛాన్సలర్స్ ఇంటర్నేషనల్ MBBS స్కాలర్‌షిప్, సిడ్నీ యూనివర్సిటీ

ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీలో MBBS అభ్యసించడానికి అంతర్జాతీయ విద్యార్థులకు 40 వేల డాలర్ల స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. CRICOS-రిజిస్టర్డ్ బ్యాచిలర్ కోర్స్‌వర్క్ డిగ్రీ కోసం దరఖాస్తు చేసుకున్న అంతర్జాతీయ విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అర్హులు. అకడమిక్ మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

వైస్-ఛాన్సలర్స్ ఇంటర్నేషనల్ MBBS స్కాలర్‌షిప్ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

నేటి కాలంలో చాలా మంది భారతీయ విద్యార్థులు రష్యా, బంగ్లాదేశ్, నేపాల్, జార్జియా, కజాఖ్స్తాన్, కిర్గిజ్‌స్థాన్ వంటి దేశాలలో మెడికల్‌ విద్య చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఆయా దేశాల్లో డాక్టర్ అయ్యేందుకు అవసరమైన విద్యా తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఇటలీ, యుఎస్, యుకె, హంగేరి వంటి మరెన్నో దేశాలు భారతీయ విద్యార్థులకు మెడిసిన్ చదవడానికి స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.