AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: వరుడి చేయి పట్టుకొమ్మంటే పంతులు చేయి పట్టుకున్న పెళ్లికూతురు.. నవ్వులు పూయిస్తున్న వీడియో

మన దేశంలో పెళ్లిళ్లు సంప్రదాయ బద్దంగా, మేళ తాళాలతో బంధుజనం సమక్షంలో ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ఇక హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగే వివాహ తంతులో కనీసం పదో రోజులపాటైన హడావిడి ఉంటుంది. పెళ్లి వేడుకలో పురోహితుడిది అత్యంత కీలకమైన పాత్ర. ఓ వైపు మంత్రాలు చదువుతూనే.. మరోవైపు వధువు, వరుడితో పెళ్లి తంతును చేయిస్తుంటారు. అయితే కొందరు పురోహితులు సందర్భానుసారంగా..

Funny Video: వరుడి చేయి పట్టుకొమ్మంటే పంతులు చేయి పట్టుకున్న పెళ్లికూతురు.. నవ్వులు పూయిస్తున్న వీడియో
Bride Holds Priest Hand During Wedding
Srilakshmi C
|

Updated on: Aug 07, 2024 | 11:34 AM

Share

మన దేశంలో పెళ్లిళ్లు సంప్రదాయ బద్దంగా, మేళ తాళాలతో బంధుజనం సమక్షంలో ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ఇక హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగే వివాహ తంతులో కనీసం పదో రోజులపాటైన హడావిడి ఉంటుంది. పెళ్లి వేడుకలో పురోహితుడిది అత్యంత కీలకమైన పాత్ర. ఓ వైపు మంత్రాలు చదువుతూనే.. మరోవైపు వధువు, వరుడితో పెళ్లి తంతును చేయిస్తుంటారు. అయితే కొందరు పురోహితులు సందర్భానుసారంగా హాస్యం పండిస్తూ నవ్వులు పూయిస్తుంటారు. అలాంటి సంఘటనే తాజాగా ఓ పెళ్లి వేడుకలో జరిగాయి. ఈ పెళ్లిలో ఆచారాల గురించి సరిగా అవగాహన లేని వధూవరులకు పురోహితుడు మార్గనిర్దేశం చేస్తున్న క్రమంలో పెళ్లి కూతురు చేసిన పనికి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

jaygogadecoration అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన ఈ వీడియోలో.. వధువురులతోపాటు, పురోహితుడు నిలబడి ఉండటం కనిపిస్తుంది. వివాహ తంతులో భాగంగా పురోహితుడు అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు వేయించడానికి వధువరులను సిద్ధం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇద్దరికీ కొంగు ముడులు వేసి ఒకరి చేయి ఒకరు పట్టుకోవాలని వధూవరులకు సూచించడం వీడియోలో కనిపిస్తుంది. అయితే సంతులుగారు చేయి పట్టుకోమని వధువు చెబుతాడు. అయితే ఎవరి చేయి పట్టుకోవాలో పంతులు చెప్పకపోవడంతో కన్‌ఫ్యూజ్‌ అయిన పెళ్లికూతురు.. వరుడి చేతికి బదులుగా లటుక్కున్న పంతులు చేయి పట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

దీంతో పురోహితుడు నవ్వుతూ.. ‘అమ్మా.. పట్టుకోవాల్సింది నా చేయి కాదు, వరుడి చేయి’ అని చెప్పడంతో వధువు సిగ్గులొలకబోస్తూ వరుడి చేయి అందుకుంటుంది. దీంతో అక్కడున్న అందరూ పగలబడి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో లక్షల్లో వ్యూస్, లైకులు, కామెంట్లు రావడంతో వైరల్‌గా మారింది. దక్కించుకుంది. నవ్వులు పూయిస్తున్న ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.