మీకు ఇంకా పెళ్లి కాలేదా..? ఆ ఆలయాన్ని దర్శించుకుంటే త్వరలోనే పెళ్లి బాజాలు పక్కా..!
కరీంనగర్ దగ్గరలో.. లోయర్ మానేర్ డ్యామ్ సమీపంలో తాపాల లక్ష్మినర్సింహాస్వామి కొలువై ఉన్నారు. స్వయంభూ ఆలయం. ఓ గుట్టకు స్వామి వారు కొలువై ఉన్నారు. మూడు దశాబ్దాల నుంచి ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ స్వామి వారిని దర్శించుకుంటే.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్ముతున్నారు. దీంతో నిత్యం పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
ఈ ఆలయం… పెద్దలు కుదిర్చిన పెళ్లిలు , ప్రేమ పెళ్లిలకు కేరాఫ్ అడ్రాస్ గా నిలుస్తోంది. స్వయంభూ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం పెళ్లిలకు ప్రత్యేక ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇప్పటి వరకు.. ఈ ఆలయంలో సుమారుగా మూడు వేయిలకు పైగా ప్రేమ పెళ్లిలు జరిగడం విశేషం. అంతేకాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలు కూడా.. మరో నాలుగు వేయిలకు పైగా అయ్యాయి. ఈ స్వామి వారి సన్నిధిలో మూడు ముళ్లతో ఒక్కటైతే.. జీవితాంతం కలిసి ఉంటామనే నమ్మకం.. ఈ నమ్మకంతోనే.. ఇక్కడ మూడు ముళ్లతో ఒక్కటవుతున్నారు.. ఈ పెళ్లిల ఆలయంపై స్పెషల్ స్టోరీ…
కరీంనగర్ దగ్గరలో.. లోయర్ మానేర్ డ్యామ్ సమీపంలో తాపాల లక్ష్మినర్సింహస్వామి కొలువై ఉన్నారు. స్వయంభూ ఆలయం. ఓ గుట్టకు స్వామి వారు కొలువై ఉన్నారు. మూడు దశాబ్దాల నుంచి ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ స్వామి వారిని దర్శించుకుంటే.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్ముతున్నారు. దీంతో నిత్యం పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ 30 యేళ్లుగా ప్రేమ పెళ్లిలు జరుగుతున్నాయి.. ఈ ఆలయంలో ప్రేమ పెళ్లి జరుగుతే ఎలాంటి భేధాలు ఉండవని ప్రేమికుల నమ్మకం. దీంతో వివిధ ప్రాంతాల నుంచీ ప్రేమ జంటలు ఇక్కడికి వచ్చి ఒక్కటవుతున్నారు. కేవలం.. ప్రేమ పెళ్లిలు కాదు… పెద్దలు కుదిర్చిన పెళ్లిలు కూడా.. నాలుగు వేయిలకు పైగా జరిగాయి.
ముహుర్తాల సమయంలో ప్రతి రోజు ఒక్కటి.. రెండు పెళ్లిలు జరుగుతున్నాయి . యువతి, యువకులు ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సంవత్సరం లోపు పెళ్లి సంబంధం కుదురుతుందన్న నమ్మకం కూడా బలంగా ఉంది. పెళ్లి కుదిరిన తరువాత స్వామి వారి సన్నిధిలోనే పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి జంటల సంఖ్య పెరుగుతుంది.. ఇటు పెద్దలు కుదిర్చిన పెళ్ళిలు.. అటు.. ప్రేమ పెళ్లిలతో.. ఈ ఆలయం సందడిగా కనబడుతుంది.
Temple For Marriageఇక్కడ పెళ్లి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు దేవస్థానం కమిటీ . మేజర్ నిండిన వారికి బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే పెళ్లి చేస్తున్నారు. అంతేకాదు.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటల తల్లిదండ్రులను పిలుపుస్తున్నారు. ప్రేమ జంటలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో.. నిబంధనల ప్రకారం మాత్రమే పెళ్లిలు జరుగుతున్నాయి.
ఇక్కడ పెళ్లిలు జరిగిన జంటలు ఈ ఆలయానికి తరుచు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.. ఇప్పుడు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. ఒక్కే ఆలయంలో ఇన్ని వివాహాలు జరగడం అరుదు. ఇలాంటి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉండకపోవచ్చు.. పెళ్లిలకు కేరాఫ్ అడ్రాస్ గా మారడంతో.. యువతి, యువకులతో పాటు.. దంపతులు ఎక్కవ వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.. శ్రావణ మాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున పెళ్లిలు జరగనున్నాయి. పెళ్లి కోసం ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ ఆలయాన్ని.. పెళ్లిల ఆలయంగా కూడా పిలుస్తున్నారు. అంతేకాదు… ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటలుపెళ్లి రోజు.. ఇక్కడికి వచ్చి స్వామి వారి దగ్గర పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ స్వామికి అద్భుత శక్తి ఉందని.. దీంతో ఇక్కడ వివాహ వేడుకలు జరుగుతున్నాయని భక్తులు నమ్ముతున్నారు.
కరీంనగర్ జిల్లానే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచీ చాలా మంది భక్తులు వస్తున్నారు.. అక్కడ పెళ్లి సంబంధాలు కుదిరినా.. ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు.. ప్రేమికులు వేరే ప్రాంతంలో పెళ్లి చేసుకున్నా.. మళ్లీ స్వామి వారి సన్నిధికి వచ్చి.. ఇక్కడ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లిల సంఖ్య పెరుగుతునే ఉంది.. పెళ్లి చేసుకున్న జంటలు.. ఇక్కడ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తున్నారు.. వారంలో శనివారం, సోమవారం భక్తులతో సందడిగా ఉంటుంది.. అంతేకాకుండా.. ఈ ముందుగానే బుక్ చేసుకుంటున్నారు.. ఈ ఆలయాన్ని.. పెళ్లిళ్ళ ఆలయంగా పిలుస్తున్నారు. అంతేకాదు.. ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటలు.. పెళ్లి రోజు.. ఇక్కడికి వచ్చి స్వామి వారి దగ్గర పూజలు. నిర్వహిస్తున్నారు. మొత్తానికి.. ఈ స్వామి కి అద్భుత శక్తి ఉందని.. దీంతో.. ఇక్కడ వివాహ వేడుకలు జరుగుతున్నాయని భక్తులు నమ్ముతున్నారు.
Temple For Marriageకరీంనగర్ జిల్లానే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచీ చాలా మంది భక్తులు వస్తున్నారు.. అక్కడ పెళ్లి సంబంధాలు కుదిరినా.. ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమికులు వేరే ప్రాంతంలో పెళ్లి చేసుకున్నా.. మళ్లీ స్వామి వారి సన్నిధికి వచ్చి.. ఇక్కడ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లిల సంఖ్య ఏటికేడు పెరుగుతునే ఉంది. ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటలు.. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తున్నారు.. వారంలో శనివారం, సోమవారం భక్తులతో సందడిగా ఉంటుంది. మంచి ముహుర్తం రోజుల్లో నవ జంటలతో ఆలయం కిటకిటలాడుతుంది. అంతేకాకుండా ఈ స్వామిని దర్శించుకుంటే… మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో.. ఈ పెళ్లిళ్ళ ఆలయానికి.. భక్తులు క్యూ కడుతున్నారు. త్వరలో జరిగే బ్రహోత్సవాలకు.. ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టారు… పెద్ద ఎత్తున దంపతులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
ఒక్కే ఆలయంలో ఇంత పెద్ద మొత్తంలో పెళ్లిలు జరగడం చాలా అరుదుగా స్థానికులు చెబుతున్నారు. తాము ఇక్కడే… ప్రేమ వివాహం చేసుకున్నామని దంపతులు చెబుతున్నారు. ప్రతి యేటా రెండు సార్లు.. స్వామి వారిని దర్శించుకుంటామని అంటున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నామని తెలుపుతున్నారు. మొదట కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఇక్కడ పెళ్లి జరగడంతో.. అన్ని సమస్యలు విముక్తి అయ్యాయయని తెలుపుతున్నారు.
తమ పెళ్లి కూడా.. ఇదే సన్నిధిలో జరిగిందని దంపతులు చెబుతున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. దీంతో… ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నామని తెలుపుతున్నారు. తమ మనవరాలి పెళ్లి కూడా ఇక్కడ జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక్కడ పెళ్లి జరగడంతో…. ఇప్పుడు.. వారి కుటుంబ సంతోషంగా ఉంటుందని అంటున్నారు. చాలా మంది ఇక్కడే పెళ్లి చేసుకుంటున్నారని తెలుపుతున్నారు.
Temple For Marriageఇక్కడ ప్రేమ పెళ్లిలతో పాటు.. పెద్దలు కుదర్బిన పెళ్లిలు భారీ సంఖ్యలో జరిగాయని ఆలయ కమిటీ కార్యదర్శి ఎల్లారెడ్డి అంటున్నారు. ఇక్కడ… ప్రేమ పెళ్లిలు మూడు వేయిలకు పైగా జరిగాయని…. పెద్దలు కుదర్చిన పెళ్లిలు నాలుగు వేయిలకు పైగా జరిగాయని అంటున్నారు. ఈ ఆలయంలో ప్రేమ పెళ్లిలలతో పాటు.. పెద్దులు కుదర్చిన పెళ్లి వేడుకలను నిత్యం నిర్వహిస్తున్నట్లు పురోహితులు అంటున్నారు. అలాగే పెళ్లి కానీ యువతి, యవకులు ఆలయాన్ని దర్శించుకుని స్వామివారిని మొక్కుకుంటే.. త్వరలోనే పెళ్లి జరుగుతుందని చెబుతున్నారు..