Viral Video: నాగిని సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ చేసిన స్త్రీ.. ఇలాంటి ప్రతిభ పల్లెటూరివారి సొంతం అంటున్న నెటిజన్లు..

వైరల్ అవుతున్న వీడియోలో ఆకుపచ్చ చీరలో ముసుగు వేసుకున్న మహిళ 'బీన్' ట్యూన్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ వీడియో జనాల్లో బాగా పాపులర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. వీడియోలో పాటలోని ప్రతి బీట్‌లో మహిళ ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది.

Viral Video: నాగిని సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ చేసిన స్త్రీ.. ఇలాంటి ప్రతిభ పల్లెటూరివారి సొంతం అంటున్న నెటిజన్లు..
Dance Video ViralImage Credit source: Instagram/@cute_sherani_girl
Follow us
Surya Kala

|

Updated on: Aug 07, 2024 | 9:30 AM

‘ఇచ్ఛధారి’ నాగిని కథ.. పాటకు పరవశిస్తూ నృత్యం చేసే సంప్రదాయం భారతీయ చలనచిత్రాలు, టీవీ సీరియల్స్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. శ్రీదేవి నటించిన ‘నాగిని సినిమా మాత్రమే కాదు నాగ పంచమి వంటి అనేక సీరియల్స్ కూడా ప్రేక్షకుల ఆదరణన సొంతం చేసుకున్నాయి. నాగిని వేణుగానం వింటే చాలు పరవశిస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి పాటలకు ఆదరణ కూడా ఎక్కువే.. ప్రస్తుతం నాగిని కోడలు కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ‘బీన్ కి ధున్’ పాటకు ఆ స్త్రీ అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ప్రజలు వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. కొంతమంది వినియోగదారులు.. స్త్రీ శక్తిని చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఆకుపచ్చ చీరలో ముసుగు వేసుకున్న మహిళ ‘బీన్’ ట్యూన్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ వీడియో జనాల్లో బాగా పాపులర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. వీడియోలో పాటలోని ప్రతి బీట్‌లో మహిళ ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది.

పిల్లవాడు వీణ వాయిస్తుండగా వీడియో మొదలవుతుంది. అయితే తలపై పల్లుతో ఉన్న స్త్రీ ఎనర్జిటిక్ తో డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. ప్రతి బీట్‌కు ఎంతో అందంగా డ్యాన్స్ చేసింది. ఆ మహిళ చుట్టూ చాలా మంది మహిళలు ఉన్నారని.. ఇలా డ్యాన్స్ చేస్తున్న సమయంలో తమ తమ ఫోన్ లో వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 60 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ మహిళను ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా నివాసి రోష్నిగా గుర్తించారు.

‘నాగిన్ బహు’ డ్యాన్స్ వీడియోను ఇక్కడ చూడండి

రోష్ని ఈ డ్యాన్స్ వీడియో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో 1.5 లక్షల మందికి పైగా పోస్ట్‌ను లైక్ చేసారు. అంతేకాదు రకరకాల కామెంట్స్ చేస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా పల్లెటూరి వ్యక్తుల ప్రతిభ వేరే స్థాయిలో ఉంటుంది అని కామెంట్ చేయగా మరికొందరు నాగమణి దొరికిన తర్వాతే కోడలు డ్యాన్స్ చేయడం అపుతుందేమో అని అంటే.. మరొకరుబీట్ ని ఆపేస్తే పాముకి పని ఉండదు అని అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..