ఆ రాత్రంతా.. ఏనుగులు పక్కనే బిక్కుబిక్కుమన్న వృద్ధురాలు, చిన్నారి

కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించి సృష్టించిన భీభత్సంలో హృదయాన్ని కదిలించే కథలు ఎన్నో.. వాటిల్లో ఒకటి ఏనుగుల గుంపు ఒక మహిళ, ఆమె కుటుంబాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించడం. బాధితురాలు సుజాత, ఆమె కుటుంబం మృత్యుముఖం నుంచి త్రుటిలో తప్పించుకుంది. తన అనుభవాలను సుజాత మీడియాతో పంచుకుంది. వరద నీరు ఉప్పొంగడంతో సుజాత ఇంటి పక్కనే ఉన్న రెండంతస్తుల ఇల్లు కూలిపోయింది.

ఆ రాత్రంతా.. ఏనుగులు పక్కనే బిక్కుబిక్కుమన్న వృద్ధురాలు, చిన్నారి

|

Updated on: Aug 06, 2024 | 9:25 PM

కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించి సృష్టించిన భీభత్సంలో హృదయాన్ని కదిలించే కథలు ఎన్నో.. వాటిల్లో ఒకటి ఏనుగుల గుంపు ఒక మహిళ, ఆమె కుటుంబాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించడం. బాధితురాలు సుజాత, ఆమె కుటుంబం మృత్యుముఖం నుంచి త్రుటిలో తప్పించుకుంది. తన అనుభవాలను సుజాత మీడియాతో పంచుకుంది. వరద నీరు ఉప్పొంగడంతో సుజాత ఇంటి పక్కనే ఉన్న రెండంతస్తుల ఇల్లు కూలిపోయింది. సుజాత, ఆమె కుటుంబం ఆ ఇంటి శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే పరిస్థితిని అంచనా వేసిన సుజాత ఏడుస్తున్న తన మనవరాలు మృదులని శిధిలాల కింద నుంచి రక్షించింది. మనవరాలి చిటికెన వేలు పట్టుకుని కష్టపడి ఆమెను శిథిలాల నుంచి బయటకు తీసింది. అంతేకాదు తనకు కనిపించిన బట్టలను తీసుకుని మనవరాలిని వాటితో చుట్టేసింది. వరద నీటిలో ఈత కొట్టడం ప్రారంభించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వయనాడ్‌ బాధితులకు.. మెగాస్టార్‌ చిరంజీవి భారీ విరాళం

Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. మధ్య ప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు

Ismart news: ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్‌లో నాసా..

25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! ఏదో అద్భుతం జరిగిందన్న వైద్యులు

 

Follow us