Ismart news: ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్‌లో నాసా..
ఊర్కిపోయేతప్పుడు బస్సు దొర్కకపోతనే మస్తు గావరైతం.అయ్యో యే గడియల ఎల్లిన్నో ఒక్క బస్సన్న దొర్కిపాడైతలేదు... ఒదిక్కు పొద్దు పోతుంది.. యేదన్న ఆటోనో , బండో అచ్చిన మంచిగుండు అని బుగులు పడ్తుంటం.. అసోంటిది అంతరిక్షంలకు పోయి కిందికొచ్చేతందుకు దిక్కు లేకుంటే ఆల్ల పరిశితి ఇంకెట్లుంటది.
ఊర్కిపోయేతప్పుడు బస్సు దొర్కకపోతనే మస్తు గావరైతం.అయ్యో యే గడియల ఎల్లిన్నో ఒక్క బస్సన్న దొర్కిపాడైతలేదు… ఒదిక్కు పొద్దు పోతుంది.. యేదన్న ఆటోనో , బండో అచ్చిన మంచిగుండు అని బుగులు పడ్తుంటం.. అసోంటిది అంతరిక్షంలకు పోయి కిందికొచ్చేతందుకు దిక్కు లేకుంటే ఆల్ల పరిశితి ఇంకెట్లుంటది.సేం సిన్మల్ల చూశ్నట్టే అయితుంది అమ్రికనుంచి అంతరిక్షం పోయిన సునితక్క విలియమక్క పరిశితి. తానోటి తలుస్తే దేవుడోటి తల్షిండంటే గిదేనేమో.. 58 ఏండ్ల వయసుల సునితక్క బోయింగు కంపినోల్లు తయార్జేష్న గాలిమోటరు పనితనమెట్లుందో చెకింగు చేస్తందుకు సునితక్క , బుచ్ విల్మోర్ అనేటాయ్న ఇద్దరు కల్సి అంతరిక్షం పోయిండ్రు. కదం అటే చిక్కిర్రిగ..ఇగ రొండ్నోల్ల పొద్దాయే ఆడ్నే ఉంటవట్టి.. ఆడ వాతవర్ణం మన భూమ్మీదున్నట్టు ఉండాదయే..బువ్వ కూరలు తినుడు కుద్రదాయే..ఇగేమున్నది సునితక్క..బుచ్చన్న ఆరోగ్యం రోజుకింత దెబ్బతింటున్నది.. సునితక్కైతే పురాగా ఈడ్సుకొచ్చింది.. కట్టెపుల్ల లెక్కైపోయింది..బొక్కల్ల బలం అంత పోయి బాగా వీకైందట. ఎక్సరు సైజులు..మన్ను మశానం ఏం చేపిచ్చిన పాయిద లేకుంటున్నదట.. ఇంక పందొమ్మిది రోజుల్ల ఆల్లు కిందికి రాకుంటే పరిశితి డేంజరే ఉండేతట్టున్నది అంటుర్రు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: 25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! ఏదో అద్భుతం జరిగిందన్న వైద్యులు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు చైనా కుటిల బుద్ధి.. బ్రహ్మపుత్రపై జలవిద్యుత్ కేంద్రం Srisailam: శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ KTR: ‘బలగం’ చిత్ర బృందానికి కేటీఆర్...
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

