రోడ్డుపై వెంటపడ్డ ఆకతాయిలు.. కంగారులో రైలెక్కి 140 కిమీ వెళ్లిపోయిన బాలికలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే

రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను కొందరు ఆకతాయిలు వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు గూడ్స్‌రైలు ఎక్కి 140 కి.మీ.లు ప్రయాణించారు. అనంతరం ఇద్దరు అమ్మాయిలను గుర్తించిన ట్రెయిన్‌ గార్డు రవినీత్‌ ఆర్య వారిని కాపాడాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆగస్టు 3వ తేదీన చోటు చేసుకుంది..

రోడ్డుపై వెంటపడ్డ ఆకతాయిలు.. కంగారులో రైలెక్కి 140 కిమీ వెళ్లిపోయిన బాలికలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే
Girls Board Train To Escape Stalkers
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 07, 2024 | 12:07 PM

లక్నో, ఆగస్టు 7: రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను కొందరు ఆకతాయిలు వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు గూడ్స్‌రైలు ఎక్కి 140 కి.మీ.లు ప్రయాణించారు. అనంతరం ఇద్దరు అమ్మాయిలను గుర్తించిన ట్రెయిన్‌ గార్డు రవినీత్‌ ఆర్య వారిని కాపాడాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆగస్టు 3వ తేదీన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌ నుంచి బయలుదేరిన రైలు రాత్రి 11.00 గంటలకు ఇటావాలో ఆగింది. సంతకం చేసేందుకు స్టేషనులోకి వెళ్లబోయిన రైలు మేనేజర్ ఆర్య ప్లాట్‌ఫాం మీద కూర్చొని భయంభయంగా దిక్కులు చూస్తున్న ఇద్దరు బాలికలను గమనించారు. దగ్గరికి వెళ్లి ఆరా తీయగా.. బాలికలు కన్నీటిపర్యంతం అవుతూ జరిగిన ఉదంతాన్ని వివరించారు. తాము హాథ్రాస్‌కు చెందిన వారమని, ట్యూషన్‌ సెంటర్‌ నుంచి తిరిగి వస్తుండగా, కొందరు కుర్రాళ్లు వెంటబడ్డారని తెలిపారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసి, సమీపంలోని హత్రాస్ స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్సు బండెక్కి దాక్కున్నట్లు తెలిపారు. కానీ ఇంతలో రైలు కదిలిపోయింది. అలా 140 కిలోమీటర్లు రైలు ప్రయాణించినట్లు తెలిపారు. కదులుతున్న రైలులో నుంచి తమ వద్ద ఉన్న సెల్‌ ఫోన్ల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. అయితే తాము ఎక్కడ దిగారో తెలియదని, తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో మాత్రం చెప్పలేకపోయామని తెలిపారు.

అనంతరం రైలు ఓ చిన్న స్టేషన్లలో ఆగినప్పటికీ తాము దిగలేదని, తమ గురించి తెలుసుకున్న కొందరు ప్రయాణికులు చిన్న స్టేషన్‌లో దిగవద్దని, పెద్ద స్టేషన్ అయిన ఇటావాలో దిగమని సలహా ఇచ్చారని తెలిపారు. ఇటావా జంక్షన్‌లో దిగిన తర్వాత అక్కడున్న వారితో మాట్లాడటానికి బాలికలిద్దరూ భయపడిపడినట్లు తెలిపారు. దీంతో రైలు గార్డు వారిని స్టేషన్ సూపరింటెండెంట్ వద్దకు తీసుకువెళ్లి, బాలికల కుటుంబాలతో మాట్లాడి సురక్షితంగా ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేశారు. అనంతరం వాళ్లు వచ్చేంత వరకూ బాలికలను రైల్వే పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యుసీ) సంరక్షణలో ఉంచామని ఆర్య తెలిపారు. తుండ్లా రైలు మేనేజర్ ఆర్య ఈ విషయంలో బాలికలకు సాయం చేసినందుకు అధికారులు ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.