AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఐదో అంతస్తు నుంచి రోడ్డుపై పడిన కుక్క.. మూడేళ్ల బాలికపై పడటంతో మృతి! వీడియో

అది రద్దీగా ఉన్న ఓ బజారు. నిత్యం స్థానికులు పలు పనుల నిమిత్తం అటుగా వెళ్తుంటారు. అయితే ఆ వీధిలో ఉన్న ఓ ఇంటి 5వ అంతస్తు నుంచి హఠాత్తుగా ఏదో రోడ్డుపై పడింది. కానీ సరిగ్గా అదే సమయానికి రోడ్డుపై ఓ తల్లీకూతురు నడుచుకుంటూ వెళ్తున్నారు. భవనం నుంచి బయటపడిన అది నేరుగా చిన్నారిపై పడటంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అసలు అంత ఎత్తు నుంచి కింద పడింది ఏంటా అని చూసిన వారంతా ముక్కున..

Watch Video: ఐదో అంతస్తు నుంచి రోడ్డుపై పడిన కుక్క.. మూడేళ్ల బాలికపై పడటంతో మృతి! వీడియో
Dog Falls From 5th Floor
Srilakshmi C
|

Updated on: Aug 08, 2024 | 12:07 PM

Share

ముంబై, ఆగస్టు 8: అది రద్దీగా ఉన్న ఓ బజారు. నిత్యం స్థానికులు పలు పనుల నిమిత్తం అటుగా వెళ్తుంటారు. అయితే ఆ వీధిలో ఉన్న ఓ ఇంటి 5వ అంతస్తు నుంచి హఠాత్తుగా ఏదో రోడ్డుపై పడింది. కానీ సరిగ్గా అదే సమయానికి రోడ్డుపై ఓ తల్లీకూతురు నడుచుకుంటూ వెళ్తున్నారు. భవనం నుంచి బయటపడిన అది నేరుగా చిన్నారిపై పడటంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అసలు అంత ఎత్తు నుంచి కింద పడింది ఏంటా అని చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. అది ఆ భవనంలో పెంచుకుంటున్న పెంపుడు కుక్క. అంత ఎత్తునుంచి కింద పడ్డా దానికి ఒక్క దెబ్బ కూడా తగలేదు. కాసేపు అలాగే పడ్డచోట కూర్చుని.. ఆ తర్వాత తోకూపుకుంటూ వెళ్లిపోయింది. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో మంగళవారం మధ్యాహ్నం ముంబ్రాలోని అమృత్‌నగర్‌లో రోడ్డుపై జనాలు నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. ఇంతలో పక్కనే ఉన్న చిరాగ్ మాన్షన్‌ బిల్డింగ్‌ ఐదో అంతస్తు నుంచి పెంపుడు కుక్క కింద పడటం వీడియోలో కనిపిస్తుంది. అయితే కింద ఉన్న రోడ్డ్‌పై తల్లితో కలిసి నడుస్తున్న మూడేళ్ల బాలికపై ఆ కుక్క పడటంతో చిన్నారి స్పృహ తప్పి రోడ్డుపై పడిపోవడం కనిపిస్తుంది. పక్కనే ఉన్న చిన్నారి తల్లి బిడ్డను భుజాన వేసుకుని, పరుగుపరుగున ఆస్పత్రికి పరుగులు తీసింది. వైద్య పరీక్షల కోసం మరో ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆలస్యం జరగడంతో.. చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

దీంతో ఆ బాలిక తల్లి గుండెలవిసేలా రోధించింది. పక్కనే ఉన్న బిడ్డను కాపాడుకోలేకపోయానే అంటూ రోధించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుక్క ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడిందా? లేదా అదే జంప్‌ చేసిందా? లేక ఆ కుక్కను ఎవరైనా కిందకు తోసేశారా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.