Mephedrone: ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం.. ఓ గది తలుపులు తెరచి చూడగా!

మహారాష్ట్రలో దాదాపు రూ.800 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మహారాష్ట్రలోని భివాండిలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు చాకచక్యంగా చేధించారు. 720 కిలోల ‘మియావ్‌ మియావ్‌’ మాదక ద్రవ్యాన్ని గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్కాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకున్నది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు..

Mephedrone: ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం.. ఓ గది తలుపులు తెరచి చూడగా!
Mephedrone Drugs
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 08, 2024 | 12:11 PM

ముంబై, ఆగస్టు 8: మహారాష్ట్రలో దాదాపు రూ.800 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మహారాష్ట్రలోని భివాండిలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు చాకచక్యంగా చేధించారు. 720 కిలోల ‘మియావ్‌ మియావ్‌’ మాదక ద్రవ్యాన్ని గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్కాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకున్నది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన 792 కిలోల లిక్విడ్‌ ఎండీ డ్రగ్స్‌ను ఏటీఎస్‌ బృందం స్వాధీనం చేసుకుంది.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై గత కొద్దికాలంగా నిఘా ఉంచిన ఏటీఎస్‌ అధికారులు భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకన్నారు. ఏటీఎస్‌ బృందం ఆపరేషన్‌లో భాగంగా అనుమానిత ఫ్లాట్‌లో పెద్దమొత్తంలో డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు సమాచారం మేరకు నిఘా పెట్టారు. భివాండి ఫ్లాట్‌పై దాడి చేయడంతో వారికి ఊహించిన దానికంటే కూడా అధికమొత్తంలో డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలో జరిగిన అతిపెద్ద డ్రగ్స్‌ ఆపరేషన్‌లలో ఇది ఒకటి. ఆ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇదే తొలిసారి.

ఈ ప్రాంతంలో అక్రమ డ్రగ్స్ తయారీ, పంపిణీ సమస్య అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. డ్రగ్ నెట్‌వర్క్‌తో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్‌ ఎక్కడికి పంపుతున్నారు? వాటి నెట్‌వర్క్‌ వివరాలను రాబట్టడానికి అధికారులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడం, నేరస్థులను కోర్టు ముందు హాజరుపరచడం లక్ష్యంగా అధికారులు గత కొంతకాలంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. కాగా మెఫెడ్రోన్ అనేది యాంఫేటమిన్, కాథినోన్ క్లాస్‌లకు చెందిన సింథటిక్ ఉద్దీపన మందు. మెఫెడ్రోన్‌ను.. డ్రోన్, M-CAT, వైట్ మ్యాజిక్, మియావ్ మియావ్, బబుల్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.