AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: ‘మేము కష్టపడి పనిచేసేవాళ్లం’ అని గుర్తుంచుకోండి.. రాహుల్ గాంధీకి అశ్విని వైష్ణవ్ కౌంటర్..

మేము కష్టపడి పనిచేసేవాళ్లం.. అని గుర్తుంచుకోండి.. అంటూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు.. కాంగ్రెస్ హయాం తర్వాత భారతీయ రైల్వేలను మెరుగైన స్థితికి తీసుకురావడంలో విజయం సాధించామని.. అశ్విని వైష్ణవ్ రాహుల్ ట్వీట్ కు రిట్వీట్ చేశారు.

Ashwini Vaishnaw: ‘మేము కష్టపడి పనిచేసేవాళ్లం’ అని గుర్తుంచుకోండి.. రాహుల్ గాంధీకి అశ్విని వైష్ణవ్ కౌంటర్..
Ashwini Vaishnaw, Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Aug 08, 2024 | 10:05 AM

Share

మేము కష్టపడి పనిచేసేవాళ్లం.. అని గుర్తుంచుకోండి.. అంటూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు.. కాంగ్రెస్ హయాం తర్వాత భారతీయ రైల్వేలను మెరుగైన స్థితికి తీసుకురావడంలో విజయం సాధించామని.. అశ్విని వైష్ణవ్ రాహుల్ ట్వీట్ కు రిట్వీట్ చేశారు. అసలేం జరిగిందంటే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో లోకో పైలట్ల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. క్యాబిన్‌లో తగిన సౌకర్యాలు.. ప్రాథమిక సౌకర్యాల కోసం వారు తమ డిమాండ్లను పునరుద్ఘాటించారని తెలిపారు.. ప్రతిరోజూ రైలులో ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికుల భద్రతకు ఇది చాలా అవసరం.. ఇది పూర్తిగా న్యాయబద్ధమైన అభ్యర్థన అంటూ రాహుల్ పేర్కొన్నారు.. ఇంకా, లోకో పైలట్‌లతో రైల్వే మంత్రితో సమావేశమయ్యారని.. వారు వారి సమస్యలను విన్నవించారు.. మంత్రి వారి సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని.. దేశప్రజల సురక్షిత ప్రయాణం కోసం ఈ సమస్యలకు పరిష్కారాలను అమలు చేసేలా తాను కూడా చూస్తానంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ అభ్యర్థనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.. రాహుల్ గాంధీ పోస్ట్ ను ఉటంకిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇలా వ్రాశారు.. ‘‘కాంగ్రెస్ కాలం నుంచి భారతీయ రైల్వేలను మెరుగైన స్థితికి తీసుకురావడంలో ఈ రోజు మేము విజయం సాధించాము. 2014 నుండి “లోకో పైలట్‌ల” సౌకర్యాలు నిరంతరం మెరుగుపరుస్తూనే ఉన్నాం.. భవిష్యత్తులో కూడా వారికి మరిన్ని సౌకర్యాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం.. గుర్తుంచుకోండి, మేము కష్టపడి పనిచేసే వ్యక్తులం..’’ అంటూ ఓ ఫొటోను మంత్రి జత చేశారు.

అశ్విని వైష్ణవ్ ట్వీట్..

2004-14 వరకు లోకో పైలట్‌లకు ఏసీతో కూడిన విశ్రాంతి గదులు జీరోగా ఉన్నాయని, ఇప్పుడు 558కి పెరిగిందన్నారు. ఇంతకు ముందు ఏసీ క్యాబిన్‌తో కూడిన ఇంజన్‌లు, వాష్‌రూమ్‌తో కూడిన లోకో క్యాబ్‌ల సంఖ్య జీరోగా ఉండేదని, 2014 – 2024 వరకు వాటి సంఖ్య వరుసగా 7075, 815కు పెరిగిందని.. అశ్విని వైష్ణవ్ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..