AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య కన్నుమూత.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం

ప్రముఖ లెఫ్ట్‌నెంట్ నేత, సీపీఎం సీనియర్ నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య (80) గురువారం (ఆగస్టు 8) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చూపు మందగించడంతో పాటు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. గతేడాది అతనికి న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి..

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య కన్నుమూత.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం
Buddhadeb Bhattacharjee
Srilakshmi C
|

Updated on: Aug 08, 2024 | 12:11 PM

Share

కోల్‌కతా, ఆగస్టు 8: ప్రముఖ లెఫ్ట్‌నెంట్ నేత, సీపీఎం సీనియర్ నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య (80) గురువారం (ఆగస్టు 8) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చూపు మందగించడంతో పాటు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. గతేడాది అతనికి న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి వచ్చింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 80 ఏళ్ల వయసులో బుధవారం ఉదయం కోల్‌కతాలోని స్వగృహంలో కన్నుమూశారు. బుద్ధదేవ్‌ భట్టాచార్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు.

కాగా 1944 మార్చి 1న కోల్‌కతాలో జన్మించిన బుద్ధదేవ్‌ భట్టాచార్య 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగాల్‌ ఏడో ముఖ్యమంత్రిగా 11ఏళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశారు. పార్టీ కోసం చాలా కీలకంగా పనిచేశారు. 1972 నుంచి రాజకీయాల్లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ బెంగాల్‌లో కమ్యూనిస్టుల మార్క్‌ను కొనసాగించారు. జ్యోతిబసు తర్వాత 11 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో అధికకాలం కొనసాగింది బుద్ధదేవ్‌ భట్టాచార్య మాత్రమే. అలాగే జ్యోతిబసు తర్వాత రెండవ, చివరి సీపీఎం ముఖ్యమంత్రి కూడా ఆయనే. భట్టాచర్యా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థి. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయన.. 2000లో శ్రీ బసు రాజీనామాకు ముందు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

సీపీఎం ముఖ్యమంత్రిగా 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో విజయభావుటా ఎగురవేశారు. జ్యోతిబసు పాలనతో పోలిస్తే భట్టాచార్య హయాంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వ్యాపారం పట్ల సాపేక్షంగా బహిరంగ విధానాన్ని అనుసరించింది. అయితే ఈ విధానమే 2011 ఎన్నికలలో వామపక్షాల చేతిలో ఓడిపోవడానికి కూడా కారణం అయింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతిలో ఆయన ఓడిపోయారు. దీంతో 34 యేళ్ల సీపీఎం సుదీర్ఘ పాలన ముగిసినట్లైంది. ఆ తర్వాత 2015లో సీపీఐ(ఎం) పొలిటికల్‌ బ్యూరో అండ్‌ కమిటీ నుంచి వైదొలగారు. 2018లో పార్టీ కార్యదర్శి సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాలతో పూర్తిగా ఇంటికే పరిమిత మయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.