AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9th Class Love Story: తల్లి నగలు విక్రయించి.. గర్ల్‌ ఫ్రెండ్‌కి ఐఫోన్‌ కొనిచ్చిన 9వ తరగతి పిల్లోడు!

ప్రియురాలికి బహుమతి కొనివ్వాలనుకున్న తొమ్మిదో తరగతి బాలుడు ఏకంగా తల్లి నగలకే ఎసరు పెట్టాడు. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో తల్లి బంగారు నగలు కొట్టేసి, ఎంచక్కా అమ్మేశాడు. ఆనక.. మొబైల్‌ షాప్‌ కెళ్లి మాంచి ఖరీదైన ఐఫోన్‌ కొని.. పల్లికిలిస్తూ గర్ల్‌ ఫ్రెండ్‌కి గిఫ్ట్‌ ఇచ్చాడు. తీరా యవ్వారం పోలీసుల దాకా వెళ్లడంతో ఏడుపులంకించుకున్నాడు. ఈ విచిత్ర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

9th Class Love Story: తల్లి నగలు విక్రయించి.. గర్ల్‌ ఫ్రెండ్‌కి ఐఫోన్‌ కొనిచ్చిన 9వ తరగతి పిల్లోడు!
Class 9 Boy Steals Mother's Gold
Srilakshmi C
|

Updated on: Aug 09, 2024 | 12:10 PM

Share

ఢిల్లీ, ఆగస్టు 9: ప్రియురాలికి బహుమతి కొనివ్వాలనుకున్న తొమ్మిదో తరగతి బాలుడు ఏకంగా తల్లి నగలకే ఎసరు పెట్టాడు. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో తల్లి బంగారు నగలు కొట్టేసి, ఎంచక్కా అమ్మేశాడు. ఆనక.. మొబైల్‌ షాప్‌ కెళ్లి మాంచి ఖరీదైన ఐఫోన్‌ కొని.. పల్లికిలిస్తూ గర్ల్‌ ఫ్రెండ్‌కి గిఫ్ట్‌ ఇచ్చాడు. తీరా యవ్వారం పోలీసుల దాకా వెళ్లడంతో ఏడుపులంకించుకున్నాడు. ఈ విచిత్ర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఢిల్లీలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన గర్ల్‌ ఫ్రెండ్‌ పుట్టినరోజు సందర్భంగా ఐఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకున్నాడు. అయితే అందుకు తొలుత డబ్బు ఇవ్వాలని తన తల్లిని కోరాడు. కానీ బాలుడికి డబ్బు ఇచ్చేందుకు తిరస్కరించాడు. దీంతో బాలుడు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తల్లి ఇంట్లో దాచిన బంగారాన్ని ఎత్తుకెళ్లి అమ్మేశాడు. ఇంట్లోని రెండు బంగారు గొలుసులు, చెవి కమ్మలు, ఉంగరం కనిపించకుండా పోవడంతో బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతోపాటు ఇరుగుపొరుగు వారిని దర్యాప్తు చేసిన ర్వాత బయటి వ్యక్తులు ఈ పని చేసే ఛాన్స్‌ లేదని పోలీసులు భావించారు. ఫిర్యాదు చేసిన మహిళ కుమారుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. పైగా దొంగతనం జరిగినప్పనుంచి మహిళ కుమారుడు కనిపించకుండా పోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం బలపడింది. వెంటనే బాలుడి స్నేహితులను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. మహిళ కుమారుడే బంగారాన్ని విక్రయించి రూ.50 వేల ఖరీదైన ఫోన్‌ కొని అదే క్లాస్‌ చదువుతున్న గర్ల్‌ ఫ్రెండ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలిపారు. దీంతో పోలీసులతోపాటు బాలుడి తల్లి కూడా షాక్‌కు గురైంది. ఈ సంఘటన ఈ వారం ప్రారంభంలో నజాఫ్‌గఢ్ ప్రాంతంలో జరుగగా.. బాలుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

బాలుడి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించాడని, చదువుపై పెద్దగా ఆసక్తి కనబరిచేవాడు కాదని, పరీక్షల్లో కూడా అత్తెసురు మార్కులు తెచ్చుకునే వాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) అంకిత్ సింగ్ మీడియాకు తెలిపారు. తల్లి డబ్బులు ఇవ్వలేదని ఆ బాలుడు దొంగతనానికి పాల్పడ్డాడని, తదుపరి విచారణ జరుగుతోందని డీసీపీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.