TG Vidya Volunteer: స్కూళ్లలో విద్యా వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం.. డీఎస్సీ ఆలస్యం అవుతుందా?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 11,062 టీచర్‌ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 2,45,263 మంది అభ్యర్ధులకు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు త్వరలోనే విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. తొలుత ఆన్సర్‌ కీ విడుదల చేసి..

TG Vidya Volunteer: స్కూళ్లలో విద్యా వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం.. డీఎస్సీ ఆలస్యం అవుతుందా?
Vidya Volunteer
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 12, 2024 | 6:46 AM

హైదరాబాద్‌, ఆగస్టు 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 11,062 టీచర్‌ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 2,45,263 మంది అభ్యర్ధులకు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు త్వరలోనే విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. తొలుత ఆన్సర్‌ కీ విడుదల చేసి, దానిపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫైనల్‌ ఆన్సర్‌ కీ రూపొందిస్తారు. అనంతరం ఫలితాలు వెలువరిస్తారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబరు 5 నాటికి పూర్తి చేసి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపికైన అభ్యర్ధులందరికీ నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించినా.. చూడబోతే నియామక ప్రక్రియ మరికాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.

ఇప్పటికే విద్యా సంవత్సరం కూడా ప్రారంభమై 3 నెలలు అవుతుంది. అయితే కొన్ని చోట్ల అవసరమైన మేరకు ఉపాధ్యాయులులేక విద్యార్ధులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం వచ్చే నెలలో కొత్త టీచర్లు నియామకం కావల్సి ఉంది. అయితే ఇంతలో అవసరమైన జిల్లాల్లో ఉపాధ్యాయ కొరత తీర్చేందుకు విద్యా వాలంటీర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీరినిప్పుడు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల పేరిట నియమిస్తూ, నెలకు వేతనంగా రూ.15,600 నిర్ణయించారు. ఇప్పటివరకు నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాలకు అనుమతి దక్కడంతో విద్యావాలంటీర్లను నియమిస్తుంది. ఆ జిల్లాల కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదనలు పంపడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నందున ఆయన ఆమోదంతో నియామకాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు నారాయణపేటలో 284 మందిని నియమించేందుకు అనుమతి లభించినప్పటికీ.. కొన్ని చోట్ల అధికంగా టీచర్లు ఉన్నందున వారిని అవసరమైన చోట్లకు డిప్యుటేషన్‌పై పంపిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నర్సింహారెడ్డి తెలిపారు. 233 మందిని నియమించుకోవాలని సూచించారు. వారిని కూడా మూడు నెలలపాటు లేదా కొత్త టీచర్లు వచ్చే వరకు మాత్రమే నియమించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లాలో 84 మందిని ఉన్నత పాఠశాలల్లో నియమించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?