ITBP Recruitment 2024: ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ పాసైన వారు అర్హులు

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ (పైనీర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 200 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..

ITBP Recruitment 2024: ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ పాసైన వారు అర్హులు
ITBP Recruitment
Follow us

|

Updated on: Aug 12, 2024 | 6:26 AM

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ (పైనీర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 200 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 10, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 200

పోస్టుల వివరాలు..

  • కానిస్టేబుల్ (కార్పెంటర్) (పురుషులు) పోస్టులు: 61
  • కానిస్టేబుల్ (కార్పెంటర్) (మహిళలు) పోస్టులు: 10
  • కానిస్టేబుల్ (ప్లంబర్) (పురుషులు) పోస్టులు: 44
  • కానిస్టేబుల్ (ప్లంబర్) (మహిళలు) పోస్టులు: 08
  • కానిస్టేబుల్ (మేసన్) (పురుషులు) పోస్టులు: 54
  • కానిస్టేబుల్ (మేసన్) (మహిళలు) పోస్టులు: 10
  • కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (పురుషులు) పోస్టులు: 14
  • కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (మహిళలు) పోస్టులు: 1

ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణతతో మేసన్/ కార్పెంటర్/ ప్లంబర్/ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్ 10, 2024వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 12, 2024 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెబర్‌ 10, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము కింద యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం ఇలా..

మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులకు గానూ ఆబ్జెక్టి్వ్‌ టైప్‌ పద్ధతిలో ప్రశ్నాపత్రం ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ హిందీ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, సింపుల్ రీజనింగ్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు కాస్త జాగ్రత్త..
Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు కాస్త జాగ్రత్త..
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు

రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..