AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC: ”గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి..” ఏపీ సర్కార్‌కు అభ్యర్ధుల వినతి..

ఏపీలో త్వరలో గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి గ్రూప్‌గా రిక్వెస్ట్‌ చేస్తున్నారు అభ్యర్థులు. గత ప్రభుత్వం తమ వినతిని పట్టించుకోలేదని..ఈ ప్రభుత్వమైనా స్పందించాలని కోరుతున్నారు. ఇంతకూ ఏంటా రిక్వెస్ట్‌..?

APPSC: ''గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి..'' ఏపీ సర్కార్‌కు అభ్యర్ధుల వినతి..
APPSC Dates
Ravi Kiran
|

Updated on: Aug 13, 2024 | 6:53 AM

Share

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీన విడుదలయ్యాయి. మొత్తం 1 లక్షా 48 వేల 881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 91 వేల 463 మంది పరీక్ష రాశారు. ఫలితాల్లో 1:50 చొప్పున 4 వేల 496 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మార్చి 17న రాష్ట్ర వ్యాప్తంగా18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. కేవలం 24 రోజుల్లోనే కమిషన్‌ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అయితే తాజాగా ప్రిలిమ్స్‌ పరీక్షలో 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేసి, మెయిన్స్‌కు అనుమతి ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

డీవైఈఓ, గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్షలకు ప్రిలిమ్స్‌ నుంచి 1:100 నిష్పత్తిలోనే ఎంపిక చేశారని..గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరుతున్నారు అభ్యర్థులు. అలాగే గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం కూడా ఒక ప్రధాన కారణంగా అభ్యర్థులు చెబుతున్నారు. కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు ఉండడంతో గ్రూప్‌ 1 సిలబస్‌ను రివిజన్‌ చేయలేకపోయామని చెబుతున్నారు. దీనిపై గత ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదనీ, కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలోనే గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఒకవేళ సానుకూలంగా స్పందించి మెయిన్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తే.. పరీక్ష సన్నద్ధతకు అభ్యర్థులు మరింత సమయం కోరే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పట్లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు జరిగే ఛాన్స్‌ లేనట్లే అవుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై వేచి చూడాలి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..