AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Brothers: అన్న అప్పుడు.. తమ్ముళ్లు ఇప్పుడు.! మెగా బ్రదర్స్.. మెగా హిట్..

Mega Brothers: అన్న అప్పుడు.. తమ్ముళ్లు ఇప్పుడు.! మెగా బ్రదర్స్.. మెగా హిట్..

Anil kumar poka

|

Updated on: Dec 14, 2024 | 9:31 PM

రావడం కాస్త లేటవ్వచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా.. ఈ డైలాగ్ గుర్తుందా.. ఇది ఇప్పుడు మెగా ఫ్యామెలీకి పెర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎప్పుడో 80వ దశకంలో మెగాస్టార్‌తో మొదలైన కొణిదెల ఫ్యామెలీ వెండితెర ప్రయాణం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతునే ఉంది. చిరంజీవి తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ల ఫ్యామెలీ మెంబర్స్ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ వచ్చారు. చిరు తర్వాత నాగబాబు నటుడిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగించగా.. ఆ తర్వాత వచ్చిన పవన్ కల్యాణ్.. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారు.

చిరు తర్వాత నాగబాబు నటుడిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగించగా.. ఆ తర్వాత వచ్చిన పవన్ కల్యాణ్.. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్ల వారసులు గురించి వారి.. సక్సెస్ గురించి.. ఇప్పుడు పెద్దా చెప్పుకోవాల్సిన పని లేదు. దాన్ని మనం సిల్వర్ స్క్రీన్‌పై చూస్తున్నాం కూడా. ఇప్పుడు విషయమేంటంటే.. అయితే ఈ మెగా బ్రదర్స్ కేవలం సిల్వర్ స్క్రీన్‌మాత్రమే తమను తాము ప్రూవ్ చేసుకోవడం కాదు.. కాస్త ఆలస్యమైనా సరే రాజకీయాల్లోనూ తమను తావు ప్రూవ్ చేసుకున్నట్టే. నిజానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే పొలిటికల్ సక్సెస్‌ను మెగా బ్రదర్స్ చూస్తారనే తెలుగు ప్రజలంతా భావించారు. పార్టీ పెట్టిన తర్వాత జనంలోకొచ్చిన చిరంజీవిని చూసేందుకు వెల్లువలా వచ్చిన జనాన్ని చూసి అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్దండ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు భయపడ్డ మాట వాస్తవమే. కానీ క్రమంగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మెగా ఫ్యామెలీ ఆశలు ఒక్కొక్కటిగా కరుగుతూ వచ్చాయి. అందుకు కారణాలు చాలా అంటే చాలా ఉన్నాయి. చివరకు ఎన్నికల ఫలితాలొచ్చేసరికి ముఖ్యమంత్రి అవుతారని భావించిన చిరంజీవి కేవలం 18 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావడం.. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన చిరు సోదరుడు నాగబాబు ఓడిపోవడం.. అప్పటికింకా యువరాజ్యాన్ని లీడ్ చేస్తున్న పవన్ కల్యాణ్ రాజకీయ అరంగ్రేటం చెయ్యకపోవడంతో ఓ రకంగా మెగా రేంజ్‌లో పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న మెగా ఫ్యామెలీ ఆశలకు...

Published on: Dec 14, 2024 06:21 PM