Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: ‘ఆవిధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదు’.. ఈ అధికారులపై సీఎం చంద్రబాబు ఫోకస్..

తన పరిపాలన ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ మీటింగ్‌లోనే శాంపిల్‌ చూపించారు సీఎం చంద్రబాబు. తన ప్రాధాన్యతలేంటో, ప్రజలు ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు. అదే టైమ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై హాట్‌ కామెంట్స్‌ చేశారు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే అఖిలభారత సర్వీస్‌ అధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు. పాలనలో కీలకమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో కాసేపు మాట్లాడారు. తనపై ఎంతో పెద్ద బాధ్యత ఉందంటూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu: 'ఆవిధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదు'.. ఈ అధికారులపై సీఎం చంద్రబాబు ఫోకస్..
CM Chandrababu
Follow us
Srikar T

|

Updated on: Jun 14, 2024 | 6:15 AM

తన పరిపాలన ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ మీటింగ్‌లోనే శాంపిల్‌ చూపించారు సీఎం చంద్రబాబు. తన ప్రాధాన్యతలేంటో, ప్రజలు ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు. అదే టైమ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై హాట్‌ కామెంట్స్‌ చేశారు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే అఖిలభారత సర్వీస్‌ అధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు. పాలనలో కీలకమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో కాసేపు మాట్లాడారు. తనపై ఎంతో పెద్ద బాధ్యత ఉందంటూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో కొందరు అధికారుల తీరు తనను బాధించిందన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆవిధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదంటూ తన ఆవేదనను, బాధను వ్యక్తపరిచారు. 1995 నుంచి ఇప్పటివరకు పలుమార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.

ముందుంది మొసళ్ల పండగ, అసలు సంగతి తర్వాత తేలుస్తాననే సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో విడివిడిగా సమావేశమై శాఖలవారీగా మాట్లాడతానని చెప్పారు. అయితే, గడిచిన ఐదేళ్లలో ఎలా వ్యవహరించారో ఎలా ప్రవర్తించారో మీరే ఆత్మసమీక్ష చేసుకోవాలంటూ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు సూచించారు చంద్రబాబు. అంతకుముందు, సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అధికారులు. మూడ్రోజులక్రితం అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించి వెనుదిరిగిన ఐపీఎస్‌ అధికారులు సునీల్‌, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కూడా బాబుకు విషెష్‌ తెలియజేశారు. అయితే, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సీఎం చంద్రబాబు ఫస్ట్‌ మీటింగ్‌ ప్రశాంతంగానే ముగిసినప్పటికీ, ఆయన చేసిన హాట్‌ కామెంట్స్‌.. కొందరు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయ్‌. మరి, ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…