పవర్ స్టార్ ఫ్యాన్ అంటే మామూలుగా ఉండదు.. శపథం చేశాడు.. అనుకున్నది నెరవేరగానే అలా మారిపోయాడు..
ఈ ఫోటోలో ఉన్నది ఆడా.. మగా అర్ధం కావట్లేదా. మరొక్కసారి బాగా చూడండి అయినా అర్ధం కాకపోతే పూర్తి వివరాలు చదవాలి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇతని పేరు తోట నరేంద్ర. ఊరు.. తెనాలి సమీపంలోని కొలకలూరు. అది 2019వ సంవత్సరం.. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అతని అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో నరేంద్ర తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ నాయకుడు రెండు చోట్ల పరాజయం పాలవ్వడం తీవ్ర వేదనకు గురి చేసింది.
ఈ ఫోటోలో ఉన్నది ఆడా.. మగా అర్ధం కావట్లేదా. మరొక్కసారి బాగా చూడండి అయినా అర్ధం కాకపోతే పూర్తి వివరాలు చదవాలి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇతని పేరు తోట నరేంద్ర. ఊరు.. తెనాలి సమీపంలోని కొలకలూరు. అది 2019వ సంవత్సరం.. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అతని అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో నరేంద్ర తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ నాయకుడు రెండు చోట్ల పరాజయం పాలవ్వడం తీవ్ర వేదనకు గురి చేసింది. పేద ప్రజలకు సేవ చేసేందుకు పార్టీ పెట్టి పోరాటం చేసినా ఒకే ఒక్క చోట గెలుపొంది ఆయన ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో శపథం చేశాడు. పవన్ కల్యాణ్ గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టే వరకూ తన కేశాలను పెంచుతానంటూ ప్రమాణం చేసుకున్నాడు.
అసెంబ్లీ ఫలితాలు తర్వాత గుండు చేయించుకున్నాడు. అప్పటి నుండి జుట్టు కత్తిరించుకోకుండా శపథం ప్రకారం ముందుకెళ్లాడు. దీంతో నరేంద్ర జుట్టు ఆడవారి జుట్టులా పెరిగింది. అయినా సిగ్గు పడలేదు. ఐదేళ్ల పాటు జుట్టు పెంచుకుంటూనే పార్టీ తరుఫున పనిచేశాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ గెలవడంతో తన మొక్కు తీర్చుకునే అవకాశం వచ్చిందని సంబరపడుతూ చెబుతున్నాడు. పైగా ఇప్పుడు పవన్ సాదాసీదా వ్యక్తి అయితే కాదు. ఒకవైపు సినిమా రంగానికి పవర్ స్టార్, ఇక సమాజానికి డిప్యూటీ సీఎం. ఇలా రెండు పదవులు హ్యాండిల్ చేస్తూ తనదైన మార్క్ చూపించబోతున్నారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే గుండు చేయించుకొని మొక్కు తీర్చుకుంటానంటున్నాడు నరేంద్ర.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…