Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదం.. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఖుష్బూ కీలక వ్యాఖ్యలు

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డూ కల్తీ కావడం పట్ల తిరుపతిని శుద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటి ఖుష్బూ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఎక్స్‌లో ఆమె తను అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదం.. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఖుష్బూ కీలక వ్యాఖ్యలు
Khushboo Sundar
Follow us
Velpula Bharath Rao

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 27, 2024 | 5:53 PM

ఎవరికైనా తిరుపతి అంటే మొదట గుర్తుకు వచ్చేది.. లడ్డూ.. ఎవరైనా తిరుపతికి వెళ్లి వచ్చారంటే ఫస్ట్ లడ్డూ ఏది అని అడుగుతారు. అంతటి ప్రసిద్ధిగాంచిన తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, కల్తీ నూనె కలిసిందనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. తిరుపతి లడ్డూకి భక్తులకు ఉన్న అనుబంధం అంత ఇంత కాదు..తిరుపతి లడ్డూ కల్తీపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా హిందూ సంఘాల నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తిరుపతి లడ్డూ కల్తీపై విచారించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డూ కల్తీ కావడం పట్ల తిరుపతిని శుద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటి ఖుష్బూ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఎక్స్‌లో ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అందరూ తిరుపతి లడ్డూ గురించి బాగా మాట్లాడుతున్నారని, హిందూ మతాన్ని టార్గెట్ చేస్తే నోరుమూసుకోవాలా?అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ గురించి మాట్లాడే వారికి ఇతర ఇస్లామ్, క్రిస్టియన్ మతాల గూర్చి ఇలా మాట్లాడేంత దమ్ము ఉందా? అని, అలా చేయాలంటేనే వెన్నులో వణుకు పుడుతుందని ఘాటుగా స్పందించారు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించడం అని పేర్కొన్నారు. అంతేగాని పక్షపాతంతో వ్యవహరించవద్దన్నారు. తను ముస్లిం అయిన హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. తనకు అన్ని మతాలు సమానమని, హిందూ మతాన్నే కావాలని లక్ష్యంగా చేసుకొని అవమానించొద్దన్నారు. అగౌరపరిస్తే సహించేది లేదన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని కలిచివేసిందని, బాధ్యులు కచ్చితంగా మూల్యం చెలించుకోక తప్పదని హెచ్చరించారు. ఇదంతా శ్రీ వెంకటేశ్వర స్వామి చూస్తానట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఖుష్బూ ట్వీట్ వైరల్‌గా మారింది.

ఖష్బూ ట్వీట్..

ఖుష్బూ ఇటు తెలుగు, అటు తమిళ్ చిత్రాల్లో మెరుస్తూ బీజీ బీజీగా గడుపుతుంది. సీనియర్ హీరోలందరీతో ఆమె జతకట్టింది. ఈమెకు తమిళంలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఆమెకు అభిమానులు గుడి కూడా కట్టారంటే ఆమెకు తమిళనాట ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమెను ఇప్పటికీ ఆదరించే వారు కూడా చాలా మంది ఉన్నారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాత వాసి’, శర్వానంద్ ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాల్లో కీలక పాత్రలో నటించింది. ఈమె ముస్లిం మతంలో పుట్టిన హిందూ మతానికి చెందిన ప్రముఖ డైరెక్టర్ సుందర్‌ను వివాహం చేసుకుంది. ఇటు సినిమాలు చేస్తునే ఆమె రాజకీయాల్లో కూడా యాక్టవ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఖుష్బూ బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు.