లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌‌కు ప్రశ్నల వర్షం.. పోలీసు విచారణలో కీలక అంశాలు

Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌ దగ్గర మూడోరోజు పోలీసు ఇంటరాగేషన్‌ కొనసాగుతోంది. లాయర్ సమక్షంలో జానీ మాస్టర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. కేసులో కీలమైన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేశారు.

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌‌కు ప్రశ్నల వర్షం.. పోలీసు విచారణలో కీలక అంశాలు
Jani Master
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 27, 2024 | 5:47 PM

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌ దగ్గర మూడోరోజు పోలీసు ఇంటరాగేషన్‌ కొనసాగుతోంది. లాయర్ సమక్షంలో జానీ మాస్టర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. కేసులో కీలమైన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేశారు. అయితే… ఇంటరాగేషన్‌లో జానీ మాస్టర్‌ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. బాధితురాలు సమర్పించిన ఆధారాలను ముందుపెట్టి జానీ మాస్టర్ దగ్గర పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్‌ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఢీ షో సమయంలో బాధితురాలు తనకు తానే పరిచయం చేసుకున్నట్లు పోలీసులకు జానీ మాస్టర్ తెలిపారు.

తనపై బాధితురాలు చేస్తోన్న లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమైనవిగా పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. బాధితురాలు మైనర్‌గా ఉన్న సమయంలో ఆమెపై తాను లైంగిక దాడి చేశానన్నది అబద్ధమని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. కేవలం తన ట్యాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలే తనను హింసించేదని.. ఈ విషయంలో చాలాసార్లు బాధితురాలు తనపై బెదిరింపులకు దిగినట్లు పోలీసు విచారణలో వెల్లడించారు. ఈ విషయంలో తాను పడుతున్న ఇబ్బంది గురించి డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. సుకుమార్ పిలిచి మాట్లాడినా బాధితురాలు తీరులో మార్పు లేదని జానీ మాస్టర్ పోలీసులకు తెలిపాడు. తనపై కుట్ర జరిగిందని.. వెనుక ఉండి తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారని.. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఈ కేసులో తనను ఇరికించారని పోలీసులకు తెలిపాడు.

ఇక మొత్తంగా శనివారంనాటితో రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించిన నాలుగు రోజుల పోలీసు కస్టడీ ముగియనుంది. శనివారం సాయంత్రం 4 గంటల వరకు ఆయన దగ్గర పోలీసుల విచారణ కొనసాగనుంది. అనంతరం రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టులో జానీ మాస్టర్‌ను పోలీసులు హాజరుపరచనున్నారు. మరోవైపు జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులు, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు ఈ నెట 19న అరెస్టు చేయడం తెలిసిందే.