Hyderabad: హైదరాబాద్ టూ అయోధ్య.. 30 గంటలు కాదు.. ఇకపై రెండున్నర గంటలే
అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే 30 గంటల సుదీర్ఘ ప్రయాణంతో పన్లేదు. కేవలం రెండున్నర గంటలే చాలు. ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా హైదరాబాద్ నుంచి అయోధ్య..
అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే 30 గంటల సుదీర్ఘ ప్రయాణంతో పన్లేదు. కేవలం రెండున్నర గంటలే చాలు. ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు శుక్రవారం నుంచి వరుసగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 27 నుంచి హైదరాబాద్ టూ కాన్పూర్, హైదరాబాద్ టూ అయోధ్యకు మధ్య వారానికి 4 రోజులు విమాన సర్వీసులు కొనసాగనుండగా.. సెప్టెంబర్ 28 నుంచి హైదరాబాద్-ప్రయాగరాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య వారానికి మూడు రోజులు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ప్రయాగరాజ్, అయోధ్యకు వెళ్లే భక్తులు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ సూచిస్తోంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ టూ అగర్తల, హైదరాబాద్ టూ జమ్మూ విమాన సర్వీసులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన ధర దాదాపుగా రూ. 5 వేలు ఉండగా, హైదరాబాద్ టూ ప్రయాగరాజ్ రూ. 5,635గా, హైదరాబాద్ టూ కాన్పూర్ రూ. 4,598గా ఉంది. కాగా, హైదరాబాద్ నుంచి ఒక్క నెలలోనే 7 నూతన విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఇది చదవండి: ఓర్నీ ప్రేమ సల్లగుండా.! భార్య బికినీ కోసం ఏకంగా ఇన్ని వందల కోట్లా.? అదేంటంటే
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..