Mulugu: వామ్మో! మూల మలుపు చెట్టుకు చీర కట్టిన దృశ్యం.. వెళ్లి చూడగా గుండె గుభేల్

ములుగు జిల్లాలో వెలుగు చూసిన విచిత్ర క్షుద్రపూజలు స్థానికులను గజగజ వణికిస్తున్నాయి. చెట్టుకు చీర కట్టి తాంత్రిక పూజలు నిర్వహించిన గుర్తుతెలియని దుండగులు అక్కడ నల్లకోడిని నైవేద్యంగా సమర్పించి క్షుద్ర పూజలు నిర్వహించారు.

Mulugu: వామ్మో! మూల మలుపు చెట్టుకు చీర కట్టిన దృశ్యం.. వెళ్లి చూడగా గుండె గుభేల్
Mulugu
Follow us
G Peddeesh Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Sep 23, 2024 | 6:50 PM

ములుగు జిల్లాలో వెలుగు చూసిన విచిత్ర క్షుద్రపూజలు స్థానికులను గజగజ వణికిస్తున్నాయి. చెట్టుకు చీర కట్టి తాంత్రిక పూజలు నిర్వహించిన గుర్తుతెలియని దుండగులు అక్కడ నల్లకోడిని నైవేద్యంగా సమర్పించి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆ విచిత్ర క్షుద్రపూజలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మనిషి కోరికలు అనంతం.. వింత వింత కోరికలు, సమస్యల పరిష్కారం కోసం ఈ మధ్య క్షుద్రపూజలు నయా ట్రెండ్‌గా మారాయి. జనం అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని క్షుద్రపూజలు జరిపే మూర్ఖులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అలాంటి మూర్ఖుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే కేటుగాళ్లు వింత వింత రూపాల్లో తాంత్రిక పూజలు నిర్వహించి ప్రజలను హడలెత్తిస్తున్నారు.

తాజాగా ములుగు జిల్లాలో వెలుగుచూసిన ఈ విచిత్ర క్షుద్ర పూజలు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. వెంకటాపురం మండలం బెస్తగూడెం శివారులో రహదారి పక్కన క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోకి వెళ్లే మూల మలుపు వద్ద ఓ చెట్టుకి చీర కట్టి.. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. చెట్లుకు చీర కట్టి తాంత్రిక పూజలు నిర్వహించిన మాంత్రికులు అక్కడ నల్లకోడిని బలిచ్చారు. పూజలు నిర్వహించిన ప్రాంతంలో పసుపు కుంకుమ, నిమ్మకాయలు పేర్చి, కోడిని కోసి వదిలిపెట్టిన ఆనవాళ్లు స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లతో పాటు.. దాని చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో అటుగా వెళ్లే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తరచూ ఇదే ప్రదేశంలో క్షుద్రపూజలు జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ విచిత్ర క్షుద్రపూజలు స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది.

ఇది చదవండి: పడుకునే ముందు ఇలా చేస్తే.. గుట్ట కూడా ఇట్టే కరగాల్సిందే.! ట్రై చేయండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా